నవ్వడం ఒక వరమైతే, నవ్వించడం గొప్ప వరం. పదిమందిని నవ్విస్తున్న వ్యక్తికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖలో పనిచేస్తున్న నాజర్ మహ్మద్ అనే వ్యక్తి కమెడియన్‌గా మారిపోయారు. అఫ్ఘనిస్తాన్‌లో ఖంసా జ్వాన్‌గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పదిమందికి నవ్వులు పంచుతున్న నాజర్ మహ్మద్‌ను తాలీబన్లు కిడ్నాప్ చేసి దారుణంగా గొంతుకోసి హత్యచేశారు. ఇస్లామ్ ప్రకారం నవ్వించడం నేరం అని అందుకే నాజర్‌ను హత్యచేశారని అంటున్నారు. కాందహార్ ప్రావిన్స్‌లోని తన ఇంటి నుంచి నాజర్ మహ్మద్‌ను బలవంతంగా ఈడ్చుకెళ్లీ చిత్రహింసలు పెట్టి గొంతుకోసి హత్యచేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో గత కొంతకాలంగా, బలగాలకు తాలిబన్లకు మధ్య పోరు జరుగుతున్నది. ఇప్పటికే దాదాపుగా 60శాతం ప్రాంతాలను తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. పరిస్థితులు మరింత దిగజారడంతో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి ప్రభుత్వ వసతి గృహాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు.
Read: ఆగస్ట్ 2 నుంచి అమెజాన్ లో స్పై థ్రిల్లర్ ‘ద కొరియర్’!