తీగ లాగితె డొంకంతా కదిలినట్టు.. ఇప్పుడు డ్రగ్స్ కేసులో తీగ లాగితే డ్రగ్స్ దందా మొత్తం బయటకు వస్తుంది.. విశాఖపట్నం డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ల సంఖ్య పెరిగిపోతోంది.. ఈ కేసులో దూకుడు పెంచిన పోలీసులు.. తాజాగా ఓ డాక్టర్ ను అరెస్ట్ చేశారు.. డాక్టర్ కృష్ణ చైతన్య వర్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు..
Drugs : హైదరాబాద్‌లో ఓ తండ్రి తన కూతురి భవిష్యత్తును రక్షించేందుకు తీసుకున్న కఠిన నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆవేదన కలిగిస్తోంది. ఏడేళ్లుగా మత్తుకు బానిసైన యువతిని చూసి, ఆమె జీవితంలో మార్పు రావాలని ఎన్నో సార్లు ప్రయత్నించిన తండ్రి చివరకు గట్టి నిర్ణయం తీసుకుని, ఇన్‌ఫార్మర్‌గా మారాడు. తన కుమార్తె తనను తానే నాశనం చేసుకుంటుండటాన్ని చూసి కన్నతండ్రి తట్టుకోలేక, TG NABB అధికారులకు పూర్తి సమాచారం ఇచ్చి ఆమెను పట్టించేందుకు సహకరించాడు. ఈ మహిళ…
Drugs Seized: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారాన్ని పట్టుకున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు. ఇందులో భాగంగా 14.2 కోట్ల విలువ చేసే కోకైన్, 76 లక్షల విలువ చేసే విదేశీ గంజాయి, 1.75 కోట్ల విలువ చేసే 1.78 కేజీల బంగారం సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు. అధికారులు పట్టుకున్న కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచింది లేడి కిలాడి. అదికూడా ఏకంగా 76 క్యాప్సూల్స్ మింగింది కెన్యా జాతీయురాలు.…
దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఢిల్లీలోని రమేష్ నగర్‌లో పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. గురువారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 200 కిలోల కొకైన్‌ను పట్టుబడింది. దీని విలువ రూ. 2 వేల కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
గుజరాత్‌లోని కచ్ తీరంలో రూ.130 కోట్ల కొకైన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున గాంధీధామ్ పట్టణం సమీపంలోని క్రీక్ ప్రాంతంలో 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. కొకైన్ పట్టుబడకుండ స్మగ్లర్లు సముద్ర తీరంలో దాచిపెట్టినట్లు కచ్-ఈస్ట్ డివిజన్ పోలీస్ సూపరింటెండెంట్ సాగర్ బాగ్మార్ తెలిపారు. కాగా.. ఎనిమిది నెలల్లో ఈ ప్రాంతంలో ఇంత మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇది రెండోసారని అధికారులు పేర్కొన్నారు.
Nigerian Drug Peddler Arrested: హైదరాబాద్‌కు మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ప్రముఖ సూత్రధారి అయిన ఒకరో కాస్మోస్ రాంసి పోలీసులకు చిక్కాడు. అతడు చాలా కాలం నుంచి నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న నైజీరియన్ల సమాచారాన్ని సేకరించి వారికోసం సహాయనిధి ఏర్పాటు చేశాడని. ఆ తరువాత వారినే జాతీయస్థాయిలో డ్రగ్ స్మగ్లింగ్‌కు వాడుకునేవాడని తెలంగాణ స్టేట్ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అతడు చాలా కాలం…
Cocaine: ఒడిశాలోని పారాదీప్ పోర్టులో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. పోర్టులోని ఓ ఓడలో రూ.220 కోట్ల విలువైన కొకైన్‌ని అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి పారదీప్ ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ వద్ద లంగర్ వేసి ఉన్న ఓడలోని క్రేన్లో 22 అనుమానాస్పద ప్యాకెట్లు కనిపించాయని వారు వెల్లడించారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భారీ మాదకదవ్యాల కుట్ర భగ్నమైంది. నార్కో-టెర్రర్ కుట్రను పోలీసులు ఛేదించారు. రాంబన్ జిల్లాలో ఒక వాహనం నుంచి రూ. 300 కోట్ల విలువైన 30 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు సూడాన్ భారత మాజీ రాయబారి దీపక్ వోహ్రా. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కెనడా ప్రధానికి సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఇటీవల జరిగిన జీ20 సమావేశానికి ఢిల్లీ వచ్చిన జస్టిన్ ట్రూడో విమానంలో కొకైన్ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అని ఆయన వెల్లడించారు. భారత స్నిఫర్ డాగ్స్ ఆయన విమానంలో డ్రగ్స్ గుర్తించాయని ఆయన పేర్కొ్న్నారు. అంతేకాదు కొకైన్ కారణంగా అతడు రెండు…