Canada: “జీ20 సమావేశాలకు వచ్చినప్పుడు కెనడా ప్రధాని కొకైన్ తీసుకువచ్చారు”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు సూడాన్ భారత మాజీ రాయబారి దీపక్ వోహ్రా. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కెనడా ప్రధానికి సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఇటీవల జరిగిన జీ20 సమావేశానికి ఢిల్లీ వచ్చిన జస్టిన్ ట్రూడో విమానంలో కొకైన్ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అని ఆయన వెల్లడించారు. భారత స్నిఫర్ డాగ్స్ ఆయన విమానంలో డ్రగ్స్ గుర్తించాయని ఆయన పేర్కొ్న్నారు. అంతేకాదు కొకైన్ కారణంగా అతడు రెండు రోజులు బయటకు కూడా రాలేకపోయాని తెలిపారు. ఆ కారణంగా ప్రధాని ఏర్పాటు చేసిన విందుకు కూడా ఆయన హాజరుకాలేదన్నారు.
Also Read: Life Certificate For Pensioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంక్ ఉద్యోగులే మీ ఇంటికొస్తారు
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ఇక తన భార్య ఢిల్లీలో ట్రూడోను చూసినప్పుడు ఆయన కాస్త డ్రగ్స్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారని తరువాత సోషల్ మీడియాలో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు ప్రచారం జరిగిందని వోహ్రో చెప్పారు. ఇక అంతే కాదు ట్రూడో చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తాడని, అంతర్జాతీయ సంబంధాల గురించి ఆయనకు కొంచెం నాలెడ్జ్ మాత్రమే ఉందని వోహ్రా పేర్కొన్నారు. ఇక తాను ఉన్న చోట్ల ఏ తప్పు జరగదని ట్రూడో అనుకుంటూ ఉంటారని అయితే తానే తప్పు చేస్తారని అర్థం వచ్చేలా వోహ్రా మాట్లాడారు. కెనడా వీసాలను రద్దు చేసి భారత్ మంచి పని చేసిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం గమనార్హం.
ఇక ఈ ఆరోపణలను కెనడా ప్రధాని కార్యాలయం ఖండించింది. ఇవి పూర్తిగా అవాస్తవం, తప్పుడు సమాచారమని వెల్లడించింది. మీడియా రిపోర్టింగ్ లో తప్పుడు సమాచారం ఎలా వస్తుందో చెప్పడానికి ఈ ఆరోపణలు మంచి ఉదాహరణ అని కెనడా కార్యాలయం పేర్కొందంటూ ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ఇక గత కొంత కాలంగా కెనడా భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఖలిస్తాన్ తీవ్రవాది నజ్జర్ హత్య కేసులో భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు చేయడంతో వివాదం మొదలయ్యింది. ప్రస్తుతం అది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ దౌత్యవేత్త చేసిన ఈ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!