ఖమ్మం జిల్లా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ఏళ్లుగా పెండింగ్‌లోఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లర్లకు అప్పగిస్తారు. ఆ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పాలి. అయితే కొన్ని సీజన్లుగా మిల్లర్లు సీఎంఆర్ అప్పగించకుండా పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి.