రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. దీని కోసం రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం నుంచి బయలుదేరి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం చేరుకోనున్న సీఎం.. అక్కడి నుంచి కత్తిమంద గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
చంద్రబాబు లాంటి చీటర్ దేశంలో మరొకరు లేరంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. మా పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోయాయన్నారు.. పిచ్చికి పరాకాష్ట టీడీపీ ఛార్జ్‌షీట్ అని ఫైర్ అయ్యారు.. 600 హామీలు ఇచ్చి, ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు.. సీఎం సంతకాలకు విలువ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఇక, ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన…
Land Rates: ఆంధ్రప్రదేశ్‌లో భూముల విలువ భారీగా పెరగబోతోంది.. రేపట్నుంచి ఏపీలో పెరగనున్న భూముల ధరలు అమల్లోకి రాబోతున్నాయి.. భూముల మార్కెట్ ధరలను సవరించే దిశగా ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది.. భూముల ధరలను పెంచబోతున్నట్టు ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లకు.. సబ్ రిజిస్ట్రార్లకు అనధికారిక సమాచారం చేరవేసింది ప్రభుత్వం.. భూముల ధరల పెంపునకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఇది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. కొన్ని చోట్లే భూముల…
Kakani Govardhan Reddy: చంద్రబాబువి అన్నీ శంకుస్థాపనలే.. వేటికీ ప్రారంభోత్సవాలు చేయలేదని ఆరోపించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నో ఆదర్శవంతమైన పథకాలు తీసుకువచ్చారు.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని తెలిపారు.. దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే అందించారు.. నామినేటెడ్ పదవుల్లో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఇచ్చారు.. కరోనాతో పాటు ఎన్నో విపత్కర పతిస్థితులు వచ్చినా ఇచ్చిన హామీలను అమలు చేశారంటూ ప్రశంసలు…