Early Elections in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు జరగడానికి ఇంకా సమయం ఉన్నా.. సీఎం జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు.. ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అని విపక్షాలు కామెంట్లు చేస్తూనే ఉన్నాయి.. ఇదే సమయంలో ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా తాము సిద్ధం అని ప్రకటిస్తున్నారు.. అయితే, ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కేబినెట్ ముగిసిన అనంతరం మంత్రులతో మాట్లాడిన సీఎం జగన్.. ముందస్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చేశారు.. ఎన్నికలకు ఇంకా మిగిలి ఉన్నది 9 నెలలేనన్న జగన్.. ఈ 9 నెలలు కష్టపడితే గెలుపు మనదేనని.. తొమ్మిది నెలల పాటు కష్టపడండి.. మిగిలినది తాను చూసుకుంటానంటూ మంత్రులతో తెలిపారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Amit Sha Review: CRCSపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష
కాగా, ఇవాళ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది.. మొత్తం 63 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుపై ఆమోదం తెలిపింఇ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ విధానం తీసుకొస్తోంది. ఏపీ గ్యారెంటెడ్ పెన్షన్ స్కీం అమలుకు ఆమోదం తెలిపింది. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ గ్యారెంటీ పెన్షన్ స్కీం బిల్లు ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది. ఉద్యోగుల భద్రత కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకొచ్చినట్లు ప్రకటించింది. మరోవైపు.. పాత ఫించను పథకానికి సమానండే ఉండేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత వచ్చే 50 శాతం ఫించనకు తగ్గకుండా, డీఏ క్రమంగా పెరిగేలా కొత్త విధంగా కొత్త బిల్లును రూపొందించారు. గ్యారెంటెడ్ పెన్షన్ బిల్ 2023 పేరుతో బిల్లు ముసాయిదాను ఆమోదించింది ఏపీ కేబినెట్.
Read Also: Bhatti Vikramarka: బిఆర్ఎస్ ఆ రెండు జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేసింది.. భట్టి విక్రమార్క ధ్వజం
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదంతో పాటు సంక్షేమ పథకాలైన అమ్మ ఒడి పథకం, జగనన్న ఆణిముత్యాలు పథకంతో పాటు ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి, అలాగే పీఆర్‌సీ ఏర్పాటునకు, కొత్త డీఏ అమలుకు ఆమోదం తెలిపింది కేబినెట్.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త పీఆర్‌సీ(12వ) ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. 2022, జనవరి 1వ తేదీ నుంచి ఉద్యోగులందరికీ ఏరియర్స్‌తో 2.73 శాతం డీఏ వర్తింపజేయనుంది. జిల్లా కేంద్రాల్లో పని చేసేవాళ్లకు 12 నుంచి 16 శాతానికి హెచ్‌ఆర్‌ఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. 6,840 కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇందులో పోలీస్ బెటాలియన్ ఖాళీలు 3,920 పోస్టులు ఉండగా.. కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 సహా మరికొన్ని శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయనున్నారు..