మా కార్యకర్తలు ఆర్ధికంగా చెడిపోయారు.. నాలుగు సంవత్సరాలుగా ఖర్చు మాత్రమే పెట్టారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఏ కార్యకర్తకు పైసా లబ్ధిలేదు, ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం, మా కార్యకర్తలు పనిచేశారని తెలిపారు.. మా కార్యకర్తలు అందరూ ఆర్ధికంగా పూర్తిగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. క్యూ ఆర్ కోడ్ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్య వివరాలను ఇందులో నమోదు చేయాలని స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమమన్వయం ఉంటుందని స్పష్టం చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి... కేంద్రాన్ని రాష్ట్రం, రాష్ట్రానికి కేంద్రం సహకారం ఉంటుందన్నారు.. పార్టీ వేరు, ప్రభుత్వం వేరన్న ఆయన.. రెండు ప్రభుత్వాల మధ్య ఎప్పటికీ సత్సంబంధాలు ఉంటాయని పేర్కొన్నారు.
CM YS Jagan: నా మనస్సు ఎప్పుడూ మీకు మంచి చేయాలనే ఆలోచన చేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు సీఎం జగన్‌ను కలిశారు ఏపీ జేఏసీ అమరావతితో సహా పలు ఉద్యోగ సంఘాల నేతలు.. కేబినెట్ మీటింగ్‌లో ఉద్యోగులకు కొత్తగా జీపీఎస్ తీసుకురావడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ ఏర్పాటు సహా ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగ…
Dharmana Prasada Rao: శ్రీకాకుళం ప్రజలు మూడు సార్లు నన్ను గెలిపించారు, నాకు మంచి గౌరవం ఇచ్చారు.. నేను ఎవరికీ భయపడను ప్రజలు కోసం గొంతెత్తుతూనే ఉంటానని ప్రకటించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రిగా, ఓ పౌరుడుగా అడుగుతున్నా.. చంద్రబాబు నీ హయాంలో ఒక్క రంగం అయినా అభివృద్ధి చేశారా? అని నిలదీశారు.. మా పై అనవసర దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. మీకంటే మేం ఎక్కువ…