Minister Jogi Ramesh: రాజకీయాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ సీఎం జగన్ కి పోటి, సాటి లేదన్నారు మంత్రి జోగి రమేష్.. కృష్ణాజిల్లా 38వ, ఎన్టీఆర్ జిల్లా 2వ నీటిపారుదల సలహా మండలి సమావేశానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటలు సమృద్ధిగా పండుతున్నాయి.. రైతులకు ఊహించిన దానికంటే ఎక్కువగా దిగుబడి వచ్చింది.. ఈ సంవత్సరం కూడా వర్షాలు మెండుగా కురుస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. రేపు కృష్ణా డెల్టా రైతంగానికి ఉదయం 9 గంటలకు నీళ్ళొదులుతామని ప్రకటించారు..
Read Also: DGP Anjani Kumar:| మానవ అక్రమ రవాణా నిరోధంలో తెలంగాణ మొదటి స్థానం : డీజీపీ అంజనీ కుమార్
ఇక, పోలవరం విషయంలో కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించేలా చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగనే అన్నారు మంత్రి జోగి రమేష్.. పులిచింత ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టుగా అభివర్ణించిన ఆయన.. సీఎం జగన్ చేతుల మీదుగా అతిత్వరలో పోలవరం ప్రారంభిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. రాష్ట్రం దేశంలో ఒక భాగమే.. తెలీని వాళ్ళు పేర్లు మారుస్తున్నాం అంటారని మండిపడ్డారు.. నారా లోకేష్ వీరుడు శూరుడు అని కామెంట్లు చేశాడు.. కానీ, రాజకీయాల్లో సీఎం జగన్ కి పోటి, సాటి లేదన్నారు.. చంద్రబాబు, లోకేష్ ఎంత తలుచుకున్నా 2024లో గెలవలేరని జోస్యం చెప్పారు మంత్రి జోగి రమేష్.