మరో సారి వైసీపీ గెలవాలి.. రాష్ట్రంలో సుభిక్ష పరిపాలన కొనసాగాలి అని ఆకాక్షించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. పల్నాడు పర్యటనలో ఉన్న ఆయన.. మంచి చేసిన ప్రభుత్వ పని తనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.. మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.890 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.. ప్రభుత్వం నుండి నేరుగా లక్ష మందికి పైగా లబ్ధి పొందారని తెలిపారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. 38 అంశాల అజెండాతో సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న కేబినెట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం కానుంది కేబినెట్.. పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గ సమావేశం.. సుమారు 19 వేల కోట్ల రూపాయాల విలువైన పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.