జగనన్న పాల వెల్లువ కాదు.. పాపాల వెల్లువ అని స్పష్టంగా చెప్పాం. జగనన్న పాల వెల్లువ పేరుతో దోపిడీ జరిగింది. జగన్ పాల వెల్లువ.. జగనన్న చేయూత చక్కగా అమలైతే రూ. 14500 కోట్లు మహిళలకు చేరేవి. మా విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు.. కానీ, పార్టీ పరంగా వైసీపీ మాత్రం కౌంటర్ ఇచ్చిందని మండిపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.
సీఎం, సీఎం కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెడుతున్నారు.. వీరిపై నిఘా పెట్టాం.. త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్.. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించాం.. వీరి ఆస్తులను కూడా అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రజా సంకల్పయాత్ర అంటూ ఉక్కు సంకల్పంతో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ చరిత్ర సృష్టించాడు.. అలాంటి పాదయాత్ర ఇవాళ్టికి ఆరేళ్లు పూర్తి చేసుకుంటుంది.. ఈ రోజును రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటుంది వైసీపీ.. అధికారంలోకి కూడా రావడంతో.. ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తోంది..
రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ నెల 7వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు.