ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులపాటు సొంత జిల్లా కడప, అన్నమయ్య జిల్లాల్లో పర్యటనలో ఉండనున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి అభి ఫంక్షన్ హాల్‌కు చేరుకొని ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్‌ఫర్సన్ జకీయా ఖానం కుమారుడు ముష్రఫ్ అలీ ఖాన్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సొంత జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు అన్నమయ్య, కడప జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది.. దీని కోసం ఇవాళ ఉదయం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. ఉదయం 12 గంటలకు రాయచోటి చేరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్ జర్నలిస్టులు.. ఇటీవల జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు కేటాయిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నందకు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.