Atchannaidu: సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం, కరవు తాండవిస్తున్నా.. కేబినెట్ భేటీలో కనీస చర్చ లేదని దుయ్యబట్టారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. దోచుకోవడం, చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే సీఎం జగన్ రెడ్డి తన సమయాన్ని వెచ్చిస్తున్నారన్న ఆయన.. కరవు మండలాల ప్రకటనలోనూ రైతులను సీఎం వైఎస్ జగన్ మోసం చేశారని విమర్శించారు. లక్షలాది ఎకరాల్లో కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నా కనీసం కేబినెట్ భేటీలో చర్చలేదు. 70 శాతం మంది ఆధార పడిన వ్యవసాయం రంగం పట్ల జగన్ రెడ్డి ఉదాసీన వైఖరికి ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కరవుతో ప్రజలు వలసబాట పడుతున్నది కనిపించడం లేదా? రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీరు అందక పడుతున్న అవస్థలపై కేబినెట్ లో చర్చించే తీరిక కూడా లేదా? వ్యవసాయ రంగంపై కనీస సమీక్ష కూడా లేకపోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. కరవు తీవ్రంగా ఉంటే.. జగన్ రెడ్డి మొక్కుబడిగా 103 కరవు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. రాష్ట్రంలో కరవుకు ప్రజలు బలవడానికి, రైతులు, రైతు కూలీల వలసలకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దోపిడీ పరిపాలనే కారణం అంటూ ఆరోపణలు గుప్పిస్తూ.. ఓ ప్రకటన విడుదల చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
Read Also: Bigg Boss 7 Telugu: అయ్యో పాపం భోలే.. ఆట పేరుతో పిచ్చ కొట్టుడు కొట్టారే..