వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులు-2023ని అందజేయనున్నారు.. ఏపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆ కార్యక్రమం జరగనుంది.. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఏ1- కన్వెన్షన్ హాల్‌లో వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.
విజయనగరం రైలు ఘటన పరిస్థితులు ప్రత్యక్షంగా చూసిన తర్వాత స్పందిస్తూ మరో ట్వీట్ చేశారు సీఎం జగన్.. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రికి అభ్యర్థించారు సీఎం జగన్.. 'నిన్న రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నన్ను చాలా బాధించింది.. రన్నింగ్‌లో ఉన్న రైలు మరో రైలును ఢీ కొట్టింది, రెండూ ఒకే దిశలో నడుస్తున్నాయి.. ఈ భయంకరమైన ప్రమాదం కొన్ని…
ఈ నెల 31వ తేదీన జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 31వ తేదీన అనగా రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది.. దీనిపై గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రేపటి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ఈ రోజు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ రోజు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది.. పలు పరిశ్రమల ప్రతిపాదనలకు, ప్రోత్సాహకాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.. ఈ సమావేశంలో మొత్తంగా రూ.19,037 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది.. వాటి ద్వారా 69,565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి..
విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం.. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను.. వారు కోలుకునేంత వరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది.. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను అన్నారు సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది.. సీఎం వైఎస్ జగన్ వెంటనే కరువు మండలాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదిలి రైతుల కష్టాలపై దృష్టి సారించాలన్న ఆయన.. సీఎం జగన్ పొలం బాట పడితే రైతుల కష్టాలు తెలుస్తాయి అన్నారు