హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ అధిష్టానం చేపట్టిన సీట్ల మార్పులు - చేర్పులపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. నాకు టిక్కెట్ వస్తోందో? రాదో? తెలియదు అన్నారు. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన వారి గెలుపు కోసం పనిచేస్తాను అని ప్రకటించారు. ఇక, అధిష్టానం నుంచి నాకు ఎలాంటి పిలుపు అందలేదన్న ఆయన.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురబ (కురుమ) సామాజిక వర్గం బలంగా ఉందని…
జనవరి నెలలో చేపట్టనున్న మూడు కీలక పథకాల అమలుపై వైఎస్ జగన్ సర్కార్ ఫోకస్ పెట్టారు.. జనవరి నెలలో మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంపు, చేయూత, ఆసరా పథకాల అమలువైపు అడుగులు వేస్తున్నారు.. అందులో భాగంగా ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కార్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీ పార్టీ మారుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.. దానికి మరింత బలాన్ని చేకూరుస్తూ.. ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం కాబోతున్నారు ఎమ్మెల్సీ వంశీ.. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలో చేరబోతున్నారంటూ ఓ వైపు ప్రచారం సాగుతుండగా.. ఇదే సమయంలో ఆయన పవన్‌తో భేటీకానుండడం హాట్ టాపిక్‌గా మారిపోయింది..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల్లోను టెన్షన్‌మొదలైంది.. దానికి ప్రధాన కారణం.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్థాలచలనం కలగడమే.. మరికొందరికి అయితే, సీటు కూడా కష్టమని అధిష్టానం నుంచి క్లారిటీగా సందేశాలు వెళ్లాయి.
Minister Peddireddy Ramachandra Reddy: తన 45 సంవత్సరాల రాజకీయం జీవితంలో పేదల కోసం ఈ స్థాయిలో పని చేసిన ముఖ్యమంత్రిని చూడలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నారా చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని, వైఎస్ జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అవ్వగానే అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు తెచ్చారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా…
‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల ద్వారా అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయడమే లక్ష్యం అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తామని, ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి అని పేర్కొన్నారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు అవసరమని, క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని సీఎం జగన్ చెప్పారు. ఆడుదాం ఆంధ్రా పోటీలను సీఎం జగన్ ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు సీఎం…
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు కలకలం సృష్టించింది. ‘పోరంబోకు భూమి కాపాడు జగనన్న’ అంటూ చల్లా అచ్చిరెడ్డి పేరుతో నల్లపాడులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. నేడు సీఎం జగన్ నల్లపాడు రానున్నారు. Also Read: Top Headlines@9AM: టాప్ న్యూస్! ‘ఆడుదాం…
Adudam Andhra Program Launch Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలను మంగళవారం గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు జరిగే క్రీడా సంబరంలో క్రికెట్,…