రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్‌లో 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు ముందే పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. టీడీపీ, జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య నెట్టింట పోస్టర్ వార్ మొదలైంది.
ఆంధ్రప్రదశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా పర్యటన నేటితో ముగియనుంది.. ఈ నెల 23వ తేదీన కడప జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన.. నిత్యం వరుస కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు.. ఇక, ఇవాళ్టితో సీఎం జగన్ కడప జిల్లా పర్యటన ముగియనుంది..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ పార్టీ కేడర్‌ను కూడా రెడీ చేస్తున్నారు. ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. మళ్లీ వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పలు నియోజకవర్గాలకు ఇంఛార్జిలను కూడా మార్చిన సంగతి తెలిసిందే.
సొంత జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్సార్ ఘాట్‌కు వెళ్లారు.. మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించారు సీఎం వైఎస్ జగన్, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ నేతలు.
రెండో రోజు తన సొంత జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగనుంది.. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకోనున్న ఆయన.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు.
ఏపీ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు మా వంతు తోడ్పాటు అందిస్తాం.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీతో కలిసి పనిచేస్తున్నాం.. 2024 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ గెలుపుకోసమే మేం పనిచేస్తాం'' అని తన ట్వీట్‌లో పేర్కొంది ఐప్యాక్
సీట్ల మార్పుపై ముఖ్యమంత్రి జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.జగన్ తనను సీఎంను చేయాలని సోనియా గాంధీ వద్దకు వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన ఫీలింగ్గే ఇప్పుడు ఎమ్మెల్యేలలో వుందన్నారు.