వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుంది.. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీన నిర్ణయం తీసుకుందన్నారు. షర్మిల తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, రాజకీయాలకు కానీ, ఎలాంటి సంబంధం లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తులపై చర్చ సాగుతోంది. కుదిరిన పొత్తులపై క్లారిటీ లేకపోగా.. కొత్త పొత్తులపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడడం.. కొత్త చర్చకు దారి తీసింది.. అసలు సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలతో పొత్తుల విషయం ఇంకా అస్పష్టంగానే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.. పొత్తుల విషయం ఇంకా ఉందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఈరోజు కేవలం వివాహ ఆహ్వానం ఇవ్వడానికి మాత్రమే వైఎస్ షర్మిల.. సీఎం జగన్ దగ్గరకు వస్తున్నారు.. అవసరమైతే షర్మిలతో నేను కూడా సీఎం జగన్ ఇంటికి వెళ్తానన్నారు ఎమ్మెల్యే ఆర్కే.
రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరిది.. ఎన్నికలకు సమాయత్తయ్యేలా ఇవాళ, రేపు సమావేశాలు ఉంటాయని తెలిపారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీల సమావేశం ప్రారంభం అయ్యింది.. ఈ కీలక సమావేశాల్లో మాట్లాడిన ఆమె.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా రెపరెపలాడుతుంది..
ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ ఇంఛార్జి చెల్లుబోయిన వేణు.. ట్రబుల్ షూటర్ ను కాబట్టి నన్ను రాజమండ్రి రూరల్‌కి పంపించారని తెలిపారు. తొలి సారి రాజమండ్రి రూరల్ లో వైసీపీ జెండా ఎగురుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, రామచంద్రపురం లో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడుకి సపోర్ట్ చేస్తానని ప్రకటించారు.
ద్రగడ చిన్న కోడలు సిరిని తుని అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిపే యోచనలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ముద్రగడ చిన్న కొడుకు గిరిబాబు భార్యనే ఈ సిరి... ఆమె సొంత ఊరు తుని నియోజకవర్గంలోని ఎస్ అన్నవరం కావడంతో.. సిరిని అదే నియోజకవర్గం నుంచి పోటీకి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.
ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, పాలన వైసీపీ బలం అన్నారు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న పేదలందరూ వైసీపీని మరోసారి గెలిపించి వైఎస్ జగన్‌ను సీఎంని చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ప్రతీ ఏడాది పెన్షన్ పెంచుతూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పెన్షన్లను క్రమంగా రూ. 3000 వరకూ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ఉంటూ పెన్షన్ వచ్చారు.. ఇప్పటి వరకు పెన్షన్ రూ.2,750గా వస్తుండగా.. ఇవాళ్టి నుంచి అది రూ.3 వేలకు పెరగనుంది.