ఎంపీ సీటు తనకు రాదని తేలిపోవడంతో టీడీపీకి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయ్యాడు.. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు.. లోక్‌సభ స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరా.. మొదట ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. పనిలోపనిగా తన కుమార్తె కేశినేని శ్వేతతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించారు. అయితే, మరోసారి బెజవాడ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు నాని.. అవసరం అయితే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతాననే…
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. వైసీపీ బైబై చెప్పడం ఖాయమనిపిస్తోంది.. పార్టీ మార్పుపై ఈ రోజు స్పష్టత ఇవ్వనున్నారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. రాయదుర్గంలో కాపు నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. అక్కడే భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనున్నారు..
సింగనమల నియోజకవర్గం అంటే అంత చిన్న చూపు ఎందుకు? అని ప్రశ్నించారు. ఒక ఎస్సీ మహిళను కాబట్టే అంత చిన్న చూపా...? అని నిలదీశారు. ఎస్సీ నియోజకవర్గానికి నీళ్లు వదలాలంటే మీకెందుకు అంత బాధ.? సింగనమల నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావాలంటే ప్రతిసారి యుద్ధం చేయాల్సి వస్తోంది.. మా కాలువల ద్వారా కుప్పంకు నీళ్లు తీసుకెళ్తుంటే చూసి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నా.. తమకు నీరు రాకుండా కొంతమంది సీఎం వద్ద పంచాయితీలు పెట్టే స్టేజ్ కి వెళ్ళింది…
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎప్పుడూ ఏదో విషయంలో సంచలన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.. ఎన్నికల సమయంలో టికెట్ల కోసం కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి అంటూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.