Narayana: నరేంద్ర మోడీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ వచ్చాక 30 మంది బ్యాంకులను ముంచేసి దేశం విడిచి వెళ్లారని ఆరోపించారు.. నీరవ్ మోడీ చెప్పి వేళ్లారంటున్నారు.. అదానీ అవినీతిపై సెబీ విచారిస్తుంది.. సెబీ తీర్పు ఇచ్చే సమయంలో సుప్రీం కోర్టు ద్వారా విచారణకు మరో 3 నెలలు గడువు ఇచ్చారని.. సుప్రీం మరో 3 నెలలు గడువు ఇచ్చిన మూడు రోజులకే ప్రపంచ కుబేరుడుగా ఆధానిని ప్రకటించారు.. సెబీ తీర్పు వచ్చి ఉంటే అదానీ జైలుకు వెళ్లేవాడని విమర్శించారు. అదానీ ఓ గంజాయి స్మగ్లర్ అని మండిపడ్డారు. ఇక, కేంద్రానికి అనుకూలంగా ఉంటే సీబీఐ నుంచి ఇబ్బంది లేదు.. లేదంటే దాడులు చేస్తాయని దుయ్యబట్టారు.
Read Also: Rakul Preet Singh: ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన రకుల్.. అందాలతో హీటేస్తున్నావే..
లిక్కర్ స్కామ్ లో వైసీపీ ప్రభుత్వం ఉంది.. తెలంగాణ లో కేసీఆర్ కూతురు ఉందని గుర్తుచేశారు నారాయణ.. బీజేపీని కౌగిలించుకోవడం ద్వారానే కేసీఆర్ రాజకీయంగా పతనమయ్యారన్న ఆయన.. లిక్కర్ స్కామ్ లో కూతురును కాపాడుకునేందుకే కేసీఆర్.. బీజేపీ ని కౌగిలించుకున్నాడని తెలిపారు. బీజేపీ వచ్చాక కేంద్రం.. ఏపీకి ఒక్క సహాయం చేయలేదు.. విభజన చట్టం అమలు చేయలేదని మండిపడ్డారు. ఇక, స్వాతంత్య్రం వచ్చాక సుదీర్ఘంగా బెయిల్ పై ఉన్న వ్యక్తి వైఎస్ జగనే అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. చంద్రబాబు.. బీజేపీతో ఉంటా.. కానీ, ఎన్నికల్లో పొత్తు వద్దు అనే పద్దతిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. 17 ఏ ఓపెన్ చేయమంటావా..? మాతో కలుస్తావా? అని చంద్రబాబును బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తుంది. బీజేపీతో కలిస్తే ఓట్లు పడవని చంద్రబాబు అనుకుంటున్నారని తెలిపారు.
Read Also: Ashika Ranganth: నువ్వు ఇక్కడే ఉండిపో అమ్మాయి… యూత్ ఫ్యానిజం చేస్తారు
ఇక, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల కమిషన్ (ఈసీ) మందలించిందన్నారు నారాయణ.. ఏపీలో ధృతరాష్ట్ర కౌగిలింతకు అధికార, ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయని.. బీజేపీ విషకౌగిలి నుంచి ప్రజలను కాపాడలనేది మా నినాదం అన్నారు. ఇండియా కూటమితో కలిసొచ్చే పార్టీలతోనే కలుస్తాం.. బీజేపీతో టీడీపీ కలవకుంటేనే మేం కలుస్తాం అని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.