Yarlagadda Lakshmi Prasad: రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్‌ని ఆకాశానికి ఎత్తుతూ.. ఫ్లెక్సీ వివాదంపై ఘాటుగా స్పందించిన ఆయన.. మరోవైపు.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ప్రశంసల వర్షం కురిపించారు.. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు.. ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుందన్నారు యార్లగడ్డ.. తారక్ ప్లెక్సీలు తొలగిస్తే తారక్‌కి వచ్చిన నష్టం ఏమీలేదన్న ఆయన.. తారక్ పై ఎవరు విమర్శలు చేస్తే వారికే నష్టం అని హెచ్చరించారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్‌ను అతడి తల్లి జిజియా బాయిలా పెంచారంటూ ప్రశంసలు కురిపించారు.
Read Also: PM Modi South Visit: నేడు సౌత్ ఇండియాలో ప్రధాని మోడీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
విజయవాడలో ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవంపై స్పందించిన యార్లగడ్డ.. అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ మంచి నిర్ణయం అన్నారు. అంబేడ్కర్ దేశానికి ఒక ఐకాన్ అని గుర్తు చేశారు. మరోవైపు, సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం అని వెల్లడించారు. జగన్ పై పిచ్చి కేసులు పెట్టారు.. లక్ష కోట్లు అవినీతిని అని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ ఒక హీరో.. నేను మంచి చేస్తేనే ఓటు వేయండని అని ధైర్యంగా చెప్పిన నేత.. అలాంటి నేత దేశంలో మరొకరు లేరని స్పష్టం చేశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. కాగా, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర చోటు చేసుకున్న ఓ పరిణామం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం విదితమే.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను నందమూరి బాలకృష్ణ ఆదేశాలను తొలగించారని.. దానికి సంబంధించిన వీడియోలో కూడా హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.