Eera Lakkappa: మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామిని వ్యతిరేకించిన అసమ్మతి వర్గం మాటే నెగ్గింది. గత కొన్ని రోజులుగా సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.. స్థానికేతరులకు టిక్కెట్ సహకరించేదీ లేదని ఖరాఖండిగా చెప్పిన వ్యతిరేకవర్గం సూచన మేరకు నియోజకవర్గం సమన్వయకర్తగా ఈర లక్కప్పను అధిష్టానం నియమించింది.. గతంలో కాంగ్రెస్ మద్దతుతో గుడిబండ సర్పంచ్‌గా గెలుపొందారు. తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మండల నాయకుడిగా ఉన్నాడు. ఎమ్మెల్యే వ్యతిరేకవర్గీయులు ఏకగ్రీవంగా లక్కప్ప పేరును సూచించినట్లు సమాచారం.. అయితే, సీఐ శుభకుమార్ ను నియమిస్తారనే ప్రచారం సాగుతూ వచ్చినా.. అనుహ్యంగా లక్కప్పను సమన్వయకర్తగా నియమించడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
Read Also: DRDO Recruitment 2024: డీఆర్‌డీవో-సీవీఆర్‌డీఈలో ఐటీఐ అప్రెంటిస్‌లు.. అర్హులు ఎవరంటే?
తాజాగా విడుదల చేసిన నాల్గో జాబితాలో.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది అధిష్టానం.. శింగనమల నుంచి 2019 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు.. మడకశిర ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి 2019లో తిప్పే స్వామి విజయం సాధించారు.. వీరికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు వైసీపీ నిరాకరించింది. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఈర లక్కప్పకు బాధ్యతలు అప్పగించింది.. ఎమ్మెల్యే తిప్పేస్వామి వ్యతిరేక వర్గంలో ఈర లక్కప్ప ఉండగా.. ఆయనికి ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వడాన్ని తిప్పేస్వామి వర్గం జీర్ణించుకోలేక పోతుంది. కాగా, వైసీపీ 4వ జాబితాలో.. 8 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఇన్‌ఛార్జిలను మార్చేసింది. ఈ మేరకు నాలుగో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని నియమించిన విషయం విదితే.