తప్పు పట్టిన సైకిల్‌ను బాగుచేసుకునేందుకు చంద్రబాబు తంటాలు పడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ పరిస్థితి ఉంది కాబట్టే.. సైకిల్ బెల్ మోగిస్తు ప్రజలను భ్రమ పెడుతున్నారనీ విమర్శించారు
చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోసం పోతారు.. నిద్రపోతున్న చంద్రముఖిని మళ్లీ నిద్రలేపినట్లు అవుతుంది.. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే అంటూ హెచ్చరించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య ఉద్దేశం ఏంటని ఢిల్లీలో మీడియా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారని.. ఏపీలో గూండా గిరి, నేరస్తులను అరికట్టడానికే పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో అవినీతిని అంతమొందించేందుకు పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో భూకబ్జాలు అడ్డుకోవడానికి పొత్తు పెట్టుకున్నాం అని వెల్లడించారు. మరోవైపు.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.. ఏపీ రాజధానిగా అమరావతిని చేస్తామని స్పష్టం చేశారు అమిత్ షా
జగన్ పాలనలో అభివృద్ధి లేదని విష ప్రచారం చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. "కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, ఇది కాదా అభివృద్ధి?.. కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తున్నాం, ఫిషింగ్ హార్బర్‌లు నిర్మిస్తున్నాం.. ఇది కాదా అభివృద్ధి?.. పిల్లలకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా?.. క్వాలిటీ చదువులు అభివృద్ధి కాదా?. -సీఎం జగన్. ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్.. 14 ఏళ్లలో ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి చేశారా?"…
ఏపీలో మరో తొమ్మిది రోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని.. వైసీపీకి ఓటేస్తేనే పథకాల కొనసాగింపు అని.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు అని సీఎం జగన్ అన్నారు.చిత్తూరు జిల్లా పలమనేరు ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కల్యాణ్ అభిమతమని.. అందుకే జట్టు కట్టామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2047 వరకు భారత్‌ను నెంబర్ వన్‌గా చేయాలనేది మోడీ సంకల్పమని తెలిపారు. ఐదేళ్లు పరదాలు కట్టుకుని జగన్ తిరిగాడని.. ఎక్కడికి వచ్చినా విధ్వంసం చేశాడు.. చెట్లు నరికేశాడని ఆరోపించారు.
జగన్ భూములు ఇచ్చేవాడే కానీ.. లాక్కునేవాడు కాదు అని స్పష్టం చేశారు సీఎం జగన్.. అసలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో చంద్రబాబుకు తెలుసా? అని నిలదీశారు. భూమిపై సంపూర్ణ హక్కులు ఇవ్వడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని స్పష్టం చేశారు.. ఏ భూమి ఎక్కడ కొనాలన్నా వివాదాలు ఉన్నాయి.. వీటన్నింటి వల్ల భూ వివాదాలు పెరుగుతున్నాయి.. ఏ రైతన్న కూడా తమ భూముల కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు.. భూమిపై ఎటువంటి…
ఈ రోజు ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్న జగన్.. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరులో పర్యటిస్తారు.. స్థానిక బస్టాండ్ సెంటర్‌లో జరిగే సభకు హాజరై సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.. ఇక, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో జగన్ పర్యటన కొనసాగనుంది.. గాంధీ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు…