CM YS Jagan: చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోసం పోతారు.. నిద్రపోతున్న చంద్రముఖిని మళ్లీ నిద్రలేపినట్లు అవుతుంది.. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే అంటూ హెచ్చరించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోంది.. జరగబోయే ఎన్నికలు, ఎమ్మెల్యేలను ,ఎంపీలను, ఎన్నుకోవడానికి కాదు.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం, ఎన్నికలు జరుగుతున్నాయి.. రాబోయే ఎన్నికల్లో మీరు వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్ని ఆగిపోతాయని హెచ్చరించారు.. చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్ళీ మోసం పోతారు.. బాబు చరిత్ర చెప్పే సత్యం కూడా ఇదే.. సాధ్యం కానీ హామీలు మేనిఫెస్టోలో పెట్టిన అర్థం కూడా అదే… ఇది గుర్తుపెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని సూచించారు.
Read Also: Warren Buffett: భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తున్నాను: వారెన్ బఫెట్
ఇక, దేవుడి దయతో, ఈ ప్రభుత్వంలో మీ బిడ్డ మీకు మంచే చేశాడు.. గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి చేశాను అన్నారు సీఎం జగన్.. మీ బిడ్డ సంక్షేమ పథకాలను మీ ఇంటికి చేర్చాడు.. నా అక్క చెల్లెమ్మల ఖాతాలో రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు జమ చేశాను.. లంచాలు లేని ,వివక్ష లేని పాలన చేశాను.. నాడు, నేడు పథకం ద్వారా, ప్రభుత్వ పాఠశాలల తలరాతను మార్చేశాను.. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యకు నాంది పలికాను.. గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి వంటి పథకాలతో, విద్యా వ్యవస్థలో విప్లవాలు తీసుకొచ్చాను.. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలు అమలు జరిగాయా మీరే ఆలోచించండి అని సూచించారు.
Read Also: Yadadri: అకాల వర్షం అపార నష్టం.. తడిసిన ధాన్యంతో రైతన్న ఆగమాగం..
మహిళల జీవితాల్లో, ఆర్థిక స్వాలంబన తీసుకొచ్చాను అన్నారు సీఎం జగన్.. ఇంటి ఇంటి వద్దకే వచ్చే పాలన అందించాను… రైతుల కోసం, రైతు భరోసా, ఉచిత పంటల భీమా ఇన్పుట్ సబ్సిడీలు, పగటిపూట తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ అందించాను.. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీని నిలబెట్టాను అన్నారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసా కల్పించేలా, 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ది.. ప్రతి గ్రామంలో, కుటుంబాలను చేయిపట్టి నడిపించే ,వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేశాను అని గర్వంగా చెబుతున్నాను అన్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.