Chandrababu: 2047 వరకు భారత్‌ను నెంబర్‌వన్‌గా చేయాలనేది మోడీ సంకల్పం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కల్యాణ్ అభిమతమని.. అందుకే జట్టు కట్టామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2047 వరకు భారత్‌ను నెంబర్ వన్‌గా చేయాలనేది మోడీ సంకల్పమని తెలిపారు. ఐదేళ్లు పరదాలు కట్టుకుని జగన్ తిరిగాడని.. ఎక్కడికి వచ్చినా విధ్వంసం చేశాడు.. చెట్లు నరికేశాడని ఆరోపించారు. ఎన్నికల ముందు తల మీద చెయ్యి పెట్టాడు, ముద్దులు పెట్టాడు, బుగ్గలు నిమిరాడు…అధికారంలోకి వచ్చాక వీరబాదుడు బాదుతున్నాడన్నారు. ఏం చేశామో ఏం చేస్తామో చెప్పుకోలేక జగన్ కన్ఫ్యూజన్‌లో పడిపోయారని విమర్శించారు. తాను సంక్షేమ కార్యక్రమాలకు 19.1 శాతం ఖర్చు పెడితే.. జగన్ పెట్టింది 15.8 శాతం మాత్రమేనన్నారు. జగన్ నవరత్నాలు రాలిపోయాయని.. జగన్ నవరత్నాలలో మొదటి రత్నం ఇసుక మాఫియా అంటూ ఆరోపించారు. రాగానే ఇసుక మాఫియాను తుంగలోకి తొక్కేస్తానని… ఉచితంగా ఇసుక ఇచ్చే పూచి నాది అని హామీ ఇచ్చారు.
Read Also: Pawan Kalyan: నాకు కొడాలి నానిని తిట్టాలని ఏమీ లేదు.. కానీ..!
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
చంద్రబాబు నవరత్నాలపై మాట్లాడుతూ.. ” రెండో రత్నం.. మద్యం మాఫియా… జే బ్రాండ్ మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది.. జే బ్రాండ్ మద్యం రద్దు చేస్తా… మందు బాబుల ఆరోగ్యం కాపాడుతా.. మూడో రత్నం… భూ మాఫియా. పట్టా దారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటోలు వేస్తున్నారు.. మీ భూములన్నీ జగన్ తన ఆన్లైన్‌లో పెట్టుకుంటాడు.. మీ భూమి మీది కాదు ఇప్పుడు.. జగన్ గుప్పెట్లో వుంది.. ఆయన ఒక ప్రైవేటు కంపెనీ పెట్టుకుని అందులో రికార్డులు అన్ని పెట్టుకుంటున్నాడు. ఇది నల్ల చట్టం.. జగన్ ల్యాండ్ గ్రాబ్బింగ్ యాక్ట్ ఇది.” అంటూ తీవ్రంగా విమర్శించారు. 2014 లో తండ్రి లేని బిడ్డను అంటూ మీ ముందుకు వచ్చాడని.. రిలయన్స్ పైన దాడులు చేశాడన్నారు. 2019 లో రిలయన్స్ మనిషికి రాజ్యసభ ఎంపీ ఇచ్చాడని విమర్శించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!