మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదివారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. షిండేతో పాటు ఆయన ప్రభుత్వ మంత్రుల బృందం కూడా ఉంది.
Maharashtra CM Eknath Shinde To Visit Ayodhya Today: మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు అయోధ్యలో పర్యటించనున్నారు. సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయోధ్య రాముడిని దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి వెంట వేల సంఖ్యలో శివసైనికులు రానున్నారు.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ లో శాంతిభద్రతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కిీలక వ్యాఖ్యలు చేశారు. 2006 ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ ను ఇటీవల కోర్డు దోషిగా తేల్చి యావజ్జీవం విధించింది. ఈ తీర్పు వచ్చిన కొద్ది రోజుల తర్వాత యోగి శనివారం మాట్లాడుతూ..దోపిడీ బెదిరింపులు మరియు అపహరణలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గ్యాంగ్‌స్టర్లు ఇప్పుడు కోర్టులు శిక్షించిన తర్వాత ప్యాంట్లు తడుపుకుంటున్నారని అన్నారు.
Atiq Ahmed: ఒకానొక సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లో చక్రం తిప్పిన గ్యాంగ్ స్టర్ కమ్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్ కు ప్రయాగ్ రాజ్ కోర్టు జీవితఖైదు విధించింది. ఆయనతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ సహా మరో ఏడుగురిని నిర్దోషులుగా గుర్తించింది. హత్య, కిడ్నాప్ తో సహా అతిక్ అహ్మద్ పై 100కు పైగా క్రిమినల్ కేసులను…
Yogi Adityanath: ఉగాది పర్వదినం రోజు పంచాగం చెబుతుంటారు పండితులు.. తెలుగు సంవత్సరాదిన పంచాగం మారిపోయి.. ఎవరికి ఎలా ఉండబోతోంది? ఏ రాశివారికి ఎలా కలిసిరానుంది..? ఆదాయం, వ్యయం.. ఇలా అనేక విషయాలు వెల్లడిస్తారు.. ఈ సందర్భంగా ఎన్టీవీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో.. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆయనది వృషభ రాశి.. 1971 డిసెంబర్ 29వ తేదీన ఆయన జన్మించారు.. ఆయనకు…
Vrindavan Temple Corridor: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బృందావన్ టెంపుల్ కారిడార్ పై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఈ టెంపుల్ కారిడార్ వల్ల తాము నిరాశ్రయులం అవుతామని.. తమ జీవనాధారం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో పాటు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు రక్తంతో లేఖలు రాస్తున్నారు. ఈ…
Yogi Adiyanath: యూపీలోని లక్నోలో వచ్చే నెలలో పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. ఈ సదస్సును ప్రోత్సహించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం నాడు లక్నోకు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే యూపీనే గుర్తుకురావాలని సీఎం యోగి వ్యాఖ్యానించారు. యూపీలో వెబ్ సిరీస్ తీస్తే 50 శాతం, ఫిల్మ్ ల్యాబ్‌లు, స్టూడియోలు స్థాపిస్తే 25 శాతం సబ్సిడీ ఇస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సమాజాన్ని ఏకం చేయడంలో,…
FIR filed in Lucknow for morphing CM Yogi's image in place of Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘ పఠాన్ ’ వరసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’పాట మొత్తం వివాదానికి కేంద్రంగా మారింది. ఈ పాటలో హీరోయిన్ దీపికా పదుకొణే బికినీపై, కొన్ని పదాలు, అశ్లీలతపై బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసభ్యకరమైన సన్నివేశాలు…
Uttar Pradesh Minister's Comments on Madrasa Students: ఉత్తర్ ప్రదేశ్ లోని మదర్సా విద్యార్థులకు గణితం, సైన్స్ బోధిస్తామని.. తద్వారా విద్యార్థులు మౌళ్వీలకు బదులుగా అధికారులు అవుతారని ఉత్తర్ ప్రదేశ్ మంత్రి ధరంపాల్ సింగ్ మంగళవారం అన్నారు. మదర్సా విద్యార్థులు అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని నరేంద్రమోదీ విజన్ అని.. అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న వక్ఫ్ బోర్డు స్థలాలను స్వాధీనం చేసుకుని పాఠశాలలు, అసుపత్రులను నిర్మిస్తామని మైనారిటి సంక్షేమ…
UP Govt investigating Namaz in train: రైలులో ముస్లింలు నమాజ్ చేస్తున్న వీడియో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. దీనిపై కొన్ని మంది సానుకూలంగా ఉండగా.. మరికొంత మంది ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే దీప్లాన్ భారతి షేర్ చేసిన ఈ వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా రైలులో నమాజ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై దీప్లాన్…