ఇప్పుడే దేశవ్యాప్తం ప్రజలు మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు. తాజాగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. సభ్యులు వారివారి సీట్లలో కూర్చున్న తరువాత ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఏ కారణం చేతనైనా ప్రత్యేక…
మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30న బలపరీక్షకు ఆదేశించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన మెజారీటీని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటికే శివసేన నుంచి 39 మంది ఎమ్మెల్యేలు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే క్యాంపులో ఉండటంతో బలపరీక్ష కీలకంగా మారింది. మంగళవారం గవర్నర్ ను కలిసిన మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్దవ్ ఠాక్రే తన మెజారిటీ కోల్పోయాడని…
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నామని చెబుతున్నారు. వీరంతా శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో గౌహతిలో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత, మాజీ సీఏం దేవేంద్ర ఫడ్నవీస్, రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే రహస్యంగా సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో…
మహారాష్ట్రలో వేగంగా పరిణామాాలు మారుతున్నాయి. ప్రస్తుతం శివసేన సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్ నాథ్ షిండే వర్గంగా చీలిపోయింది. రెబెల్ ఎమ్మెల్యేలు గౌహతి నుంచి రాజకీయం నడుపుతుండగా.. ఉద్ధవ్ వర్గం ముంబై కేంద్రంగా రాజకీయాలు చేస్తోంది. ఇప్పటికే సీఎం ఉద్ధవ్ ఠాక్రే సిఫారసు మేరకు డిప్యూటీ స్పీకర్ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో పాటు, అసెంబ్లీలో శివసేన ఫ్లోర్ లీడర్ గా ఏక్ నాథ్ షిండేను తప్పించి అజయ్ చౌదరిని డిప్యూటీ స్పీకర్…
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు ఎదురవుతున్నాయి. సినిమాను తలపించే విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రెండు వర్గాలు విడిపోయిన శివసేన తమ పంతాలు నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎంపీ సంజయ్ రౌత్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) సమన్లు జారీ చేసింది. జూన్ 28న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి, ప్రస్తుతం…
మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు డిప్యూటీ స్పీకర్ అనర్హతను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నేడు సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టనుంది. మరోవైపు రెబెల్ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. సోమవారం ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గౌహతి లోని రాడిసన్ బ్లూ హోటల్ లో 2 గంటలకు భేటీ కాబోతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ తో…
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే శివసేన నుంచి ఒక్కక్కరుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే వర్గానికి జంప్ అవుతున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. శుక్రవారం అర్థరాత్రి గుజరాత్ వడోదర కేంద్రంగా ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపినట్లుగా వార్తలు…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. సినిమాను తలపించేలా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎలాంటి అనుమానాలు రాకుండా శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే పార్టీలో చీలిక తీసుకువచ్చాడు. ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేలలోని 38 మందితో పాటు 8 మంది స్వతంత్రులు ఏక్ నాథ్ షిండే క్యాంపులో ఉన్నారు. గుజరాత్ సూరత్ నుంచి అస్సాం గౌహతికి రెబెల్ నేతలు క్యాంప్ మార్చారు. మరోవైపు మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు తమ మహావికాస్ అఘాడీ…
మహారాష్ట్రలో రాజకీయం సినిమాను తలపిస్తోంది. రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ‘ మహావికాస్ అఘాడీ’ కూటమి ప్రస్తుతం మైనారిటీలో పడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే తో 37 మంది శివసేన ఎమ్మెల్యేలు అస్సాం గౌహతిలో క్యాంపు ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరో 7-8 మంది స్వతంత్ర ఎమ్యెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో శివసేన ఇప్పుడు అధికారంతో పాటు పార్టీని కూడా…
మహారాష్ట్రలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే పార్టీలో చీలిక తీసుకువచ్చారు. మొత్తం 57 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఏక్ నాథ్ షిండే క్యాంపులోకి 39 మంది ఎమ్మెల్యేలు చేరారు. దాదాపుగా ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే క్యాంపులో 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఉద్ధవ్ క్యాంపు నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏక్ నాథ్ షిండే సిద్ధమవుతున్నట్లు సమాచారం.…