IPS officer: ఎంతో కష్టపడి సివిల్స్ క్లియర్ చేశాడు, ఎన్నో ఆశలతో పోస్టింగ్‌లో చేరేందుకు వెళ్తున్న యువ ఐపీఎస్ అధికారి విగతజీవిగా మారాడు. మధ్యప్రదేశ్‌కి చెందిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి కర్ణాటకలోని హసన్ జిల్లాలో తన మొదటి పోస్టింగ్ బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
Congress: రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బడిముబ్బడిగా హామీల వర్షం కురిపించింది. అయితే, ఇప్పుడు ఈ హామీల వల్ల ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొత్త పన్నులు విధించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక సర్కార్ ప్రతిపాదించిన ‘‘గ్రీన్ సెస్’’ ముసాయిదా రూపొందించకముందే రాజకీయంగా కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎత్తేస్తున్నారంటూ వచ్చిన వార్తలతో కర్ణాటకలో తీవ్ర కలకలం రేగింది. దీపావళి పండుగ రోజున మహిళలకు షాక్ తగిలినట్లైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై పున:సమీక్షిస్తామంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అన్నారు.
ED Raids On Muda office: కర్ణాటకలో సంచలనం రేపుతున్న మూడా స్కాం కేసులో 12 మంది సభ్యులతో కూడిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం ఈరోజు (శుక్రవారం) మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంపై సోదాలు చేస్తుంది.
ముడా స్కామ్ వ్యవహారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముడా వివాదానికి సంబంధించి సీఎంపై ఈడీ కేసు నమోదు చేయడంతో.. ఆయన భార్య పార్వతి సంచలన నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్లాట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
CM Siddaramaiah : ముడా (మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కష్టాలు పెరుగుతున్నాయి. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.
Karnataka Governor: కర్ణాటక ప్రభుత్వం- రాజ్‌భవన్‌ల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం కొనసాగుతుంది. మే 2023 నుంచి లోకాయుక్తలో ప్రభుత్వ అధికారులపై ప్రాసిక్యూషన్ కేసులపై గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సమాచారం కోరారు.
Congress leader: కర్ణాటక గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ ‘‘బంగ్లాదేశ్’’ తరహా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేత ఇవాన్ డిసౌజా బెదిరించడం వివాదాస్పదంగా మారింది. ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్ విచారణకు ఆదేశించారు. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిసౌజా గవర్నర్‌ని హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు.