తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 6 గంటలుగా కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. క్యాబినెట్ లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశ తేదీల ఖరారు అంశంపై సీఎం రేవంత్రెడ్డి మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జరిగింది. రెండు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయ పరమైన చిక్కులు లేకుండా న్యాయ నిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఢిల్లీ పర్యటన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఊహాగానాలతో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.
తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి... అయితే, గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తామని చెప్పామంటూ కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు.
BJP MP Laxman: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. పాలన చేతకాక అయోమయ, గందరగోళంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ముసుగులో గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందారు.. ఆ ప్రాజెక్ట్ ఉత్తర భాగం రైతులకు నష్టం చేశారు అని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో చర్చించామని అన్నారు. గోదావరి జలాలను మూసీ నదికి అనుసంధానించాలని మొన్ననే ప్రధానిని కోరాము. ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగం గురించే ప్రధానంగా చర్చించామని తెలిపారు. తెలంగాణలోని నికర జలాలపై సమ్మక సారక్క ప్రాజెక్టు, సీతారామ తదితర ప్రాజెక్టులు కడుతున్నాం. మా శాశ్వత కేటాయింపుల్లోని…
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి, కేసీఆర్తో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలిపారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి పర్యటన అనంతరం SLBC టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. మొదటగా ఉదయం 11.30 గంటలకు వనపర్తి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, పూజలు నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు పునాది రాయి వేసి, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా…
విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్తను అందించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏటీసీ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. కార్మిక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా(ఏటీసీ) అప్ గ్రేడ్ చేసే ప్రక్రియ పురోగతిపై ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాల్సిందేనని తెలిపారు. ఐటీఐలు లేనిచోట ఏటీసీలను ఏర్పాటు చేయాలని అధికారులకు…
మామునూరు ఎయిర్ పోర్టుకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. ఈ రోజు నిర్వహించిన సమీక్షలో ఎయిర్ పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.