తెలంగాణ సీఎం రేవంత్ ను ఈరోజు సినీ ప్రముఖులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సినీనటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు. ఈ కలయికపై మంచి విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవడం ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి నుంచి చాలా ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవడం, చర్చించడం చాలా అద్భుతంగా ఉంది.
నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. హాజరైన సీఎం తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేడు పూర్తి కానుంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు, బీఆర్ఎస్ (BRS) నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ నుండి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం అభ్యర్థులు నయోమిఇన్టిన్…
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈనెల 10న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లారు. సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినకు వెళ్లారు.
నిన్న మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అబద్ధాలు మాట్లాడేవారని.. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారన్నారు.
చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద పరిశ్రమ అయిన చేనేతను సర్కారు ఆదరించింది. ‘చేనేత వృత్తిపై ఆధారపడిన నేతన్నలకు కాంగ్రెస్ సర్కారు అండగా ఉంటుంది. నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటాం. రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నలకు కూడా మాఫీ చేస్తాం. రుణమాఫీకి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాం’ గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన…
త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ఆయన ప్రసంగించారు. "తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసి... తెలంగాణ వచ్చాకే పదవులు తీసుకుంటా అని చెప్పిన నేత కొండా లక్ష్మణ్ బాపూజీ. బీఆర్ఎస్ కి పురుడు పోసింది కొండా బాపూజీ. పార్టీ పెట్టినప్పుడు నీడ కల్పించింది ఆయనే.. కానీ ఆయనకు నిలువ నీడా లేకుండా చేశారు.…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్‌తో ఏఐసీసీ పెద్దలు ఫోన్లో మాట్లాడారు. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 8.15 గం.కు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.
కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో బస్సులు అద్దెకు పెట్టుకునే వారని.. కానీ మా ఆత్మ బంధువులు మీరు.. అందుకే ఆర్టీసీ బస్సులు కాంట్రాక్టు మీకే ఇచ్చామని మహిళలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 150 బస్సులు ఇవాళ రోడ్డు మీదకు వచ్చాయని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు.