నాయకుల కంటే కార్యకర్తల పైనే ఎక్కువ నమ్మకం..
నందిగామ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “2004 లో గెలిచి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది.. హైదరాబాద్ అభివృద్ధి చేశామని.. రాష్ట్ర విభజన తర్వాత 2014 లో మళ్ళీ గెలిచాము.. చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ముఖ్యం.. కార్యకర్తలు యక్టీవ్ గా లేకపోతే పార్టీకి కష్టం.. మొదటి రోజు నుంచే కార్యకర్తల కోసం కష్టపడుతున్నా.. పార్టీని సమర్ధవంతంగా స్ట్రీమ్ లైన్ చెయ్యడం కోసం ఎంతో కష్టపడుతున్నాం.. ఏ పార్టీ కార్యాలయంలో లేని గౌరవం టీడీపీలో దొరుకుతుంది..
కేటీఆర్ మాటలపై క్యాడర్ చర్చలు..?
ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉంది. ఎన్నికల్లో గెలుస్తామో లేదో కూడా తెలియదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న ఈ పార్టీ హామీల మీద హామీలు గుప్పిస్తుంది. అధికారంలోకి వస్తే తాము ఇది చేస్తాం అది చేస్తామంటూ చెబుతోంది. ఇలా హామీలు ఇవ్వడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయా లేదా క్యాడర్లో కాన్ఫిడెన్స్ కోసమే ఈ హామీలు ఇస్తున్నారా…? పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి జనాల సమస్యలను ఏకరవు పెడుతూ పబ్లిక్ లోకి వెళ్తుంది.. జనాల సమస్యలను ఏకరువు పెడుతూనే పార్టీని కూడా బలోపేతం చేసే దిశగా వెళుతుంది బి ఆర్ ఎస్. అందుకోసమే పార్టీ క్యాడర్ కు కాన్ఫిడెన్స్ ఇచ్చే మాటలు చెబుతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అవకాశం వచ్చినప్పుడల్లా వచ్చే ఎన్నికల తర్వాత చేయబోయే పనుల గురించి బల్లగుద్ది చెప్తున్నారు. హామీల రూపంలో కాకుండా ఆర్డర్ రూపంలోనే చెప్పేస్తున్నారు కేటీఆర్. పార్టీ మీటింగ్ లైనా మీడియా సమావేశాలైన నిరసన కార్యక్రమాల్లో అయినా కేటీఆర్ ఇప్పుడు కాన్ఫిడెంట్ గా కొన్ని మాటలు చెబుతున్నారు. ఆయన చెప్పే మాటలన్నీ ఇప్పుడు కేడర్ లో ఇటు జనాల్లో చర్చనీయాంశ అంశాలుగా మారాయి.
కోడ్ వర్డ్స్, సీక్రెట్ గ్రూప్స్.. బెట్టింగ్ మాఫియా కొత్త ప్లాన్
ఐపీఎల్ వచ్చిందంటే చాలు.. 45 రోజులు పాటు యువత బెట్టింగ్ ఆడుతూనే ఉంటారు ..బాల్ ..బాల్..కి బెట్టింగ్ చేస్తూ డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు పోగొట్టుకుంటారు.. వచ్చేవాళ్ళకు వస్తేనే ఉంటాయి ..ఆన్లైన్ బెట్టింగ్లపై నిఘా ఉండడంతో ఇప్పుడు వాట్సాప్ లో టెలిగ్రామ్ లో బెట్టింగ్లో మొదలయ్యాయి.. బెట్టింగ్ మాఫియా చిన్న గ్రూపులను తయారుచేసి ఆ గ్రూపుల ద్వారా బెట్టింగ్ ఆడిస్తుంది ..స్థాయిని బట్టి గ్రూపులు ఏర్పాటు చేసి పెట్టి నిర్వహిస్తది. జాతీయ అంతర్జాతీయ స్థాయి నుంచి గల్లి వరకు బెట్టింగ్ స్వేచ్ఛగా నడుస్తుంది. బెట్టింగ్ మాఫియాని కంట్రోల్ చేసేందుకు అటు పోలీసులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు బెట్టింగ్ అనేది లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు కానీ మాఫియా మాత్రం వాట్సాప్ టెలిగ్రామ్ ఇంస్టాగ్రామ్ లో కోడ్ భాషల్లో ఈ బెట్టింగులు నిర్వహిస్తుంది. ఎవరైతే బెట్టింగ్ పాలుపంచుకుంటున్నారో వాళ్లకు డైరెక్టుగా లింకులు వస్తున్నాయి ..అదే మాదిరిగా బెట్టింగ్ ఆడుతున్న వారికి వాట్సప్ గ్రూపులో యాడ్ అయిపోతున్నారు ..టెలిగ్రామ్ లో లెక్కలేనంత లిమిట్స్ లేకపోవడంతో అందులో చాలామంది ఆడ్ అవుతున్నారు ..గుట్టు గా పర్సన్ టు పర్సన్ నడుస్తున్న ఈ బెట్టింగ్ వ్యవహారం చేసేందుకు అధికారులు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. హాట్ ఫేవరెట్ గా ఉన్న జట్లపైన ఈ డబ్బులు మరీ ఎక్కువగా పెట్టేస్తున్నారు. చాలామంది అప్పులు చేసి మరీ బెట్టింగ్ ఆడుతున్నారు.. బెట్టింగ్ మాఫియాని కట్టడి చేయడానికి అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా బెట్టింగ్ కంట్రోల్ లోకి రాకపోగా విపరీతమైపోయింది..
మొదటిసారి జపాన్ ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ఇండియన్ పెవిలియన్
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు జపాన్ పర్యటనలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారుల బృందం ఈ పర్యటనలో భాగంగా జపాన్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవబోయే కార్యక్రమం జపాన్‌లో తొలిసారిగా నిర్వహించబోయే ఒసాకా ఇండస్ట్రియల్ ఎక్స్ పో. ఈ ఎక్స్ పోలో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఇండియన్ పెవిలియన్‌లో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు తమ తమ ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నాయి.
HCU భూముల తప్పుడు ప్రచారం పై ప్రభుత్వం సీరియస్
హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్ వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పట్టు చీరలో శ్రీరామ నామం.. నేతన్న శ్రద్ధార్చన
భక్తి, కళ, నైపుణ్యానికి మేళవింపు అంటే సిరిసిల్ల చేనేతకారుల గొప్పతనం గుర్తుకు వస్తుంది. ఆ సంప్రదాయాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తు చేస్తూ, శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారాముల కల్యాణానికి ఒక అరుదైన పట్టు చీరను రూపొందించి ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు సిరిసిల్ల నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్. ఈ చీరకు ప్రత్యేకత ఏమిటంటే – ఇది కేవలం పట్టు చీర మాత్రమే కాదు, ఇది భక్తి రూపంలో ఓ కళాత్మక కానుక. సీతమ్మకు అర్పించే ఈ బంగారు పట్టు చీరను హరిప్రసాద్ చేతి మగ్గంపై నేస్తూ పూర్తి 10 రోజులు శ్రమించాడు. చీర కొంగులో భద్రాచల రామాలయం మూలవిరాట్ దేవతామూర్తులు ప్రతిరూపంగా కనిపించేలా నెయ్యడం విశేషం.
2034 తర్వాతే “జమిలి ఎన్నికలు”.. నిర్మలా సీతారామన్ క్లారిటీ..
జమిలి ఎన్నికలపై వస్తున్న పుకార్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’పై వస్తున్న తప్పుడు కథనాలను శనివారం ఆమె తోసిపుచ్చారు. రాబోయే ఎన్నికల్లో దీన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఏక కాల ఎన్నికల ద్వారా ఇంత భారీ ఖర్చును ఆదా చేయవచ్చని ఆమె చెప్పారు.
మాజీ మంత్రి రోజా భర్త సెల్వమణికి షాక్.. తమిళ నిర్మాతల సంఘం కీలక నిర్ణయం
మాజీ మంత్రి రోజా భర్త సెల్వమణికి తమిళ నిర్మాతల సంఘం షాక్ ఇచ్చింది. ఫెప్సీపై పలు ఆంక్షలు విధించడంతో, మాకు మద్దతుగా నిలిచిన కార్మికులతో కొత్త యూనియన్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడుగా ఆర్కే. సెల్వమణి ఉన్నారు. గత కొద్దికాలంగా తమిళ నిర్మాతల మండలి వర్సెస్ దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి మధ్య వార్ నడుస్తోంది. సభ్యులు కొంత కాలంగా ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు.
దారుణం.. హార్ట్ సర్జరీలు చేసిన “ఫేక్ డాక్టర్”.. ఏడుగురి మృతి..
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నకిలీ డాక్టర్, కార్డియాలజిస్ట్‌ని అని చెప్పుకుంటూ పలువురు రోగులకు సర్జరీలు చేశాడు. ఈ ఘటనలో సర్జరీలు ముగిసిన తర్వాత ఏడుగురు పెషెంట్లు మరణించిన సంగతి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని దామోహ్ నగరంలోని ఒక ప్రైవేట్ మిషనరీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్లు జరిగాయి. నకిలీ డాక్టర్ వైద్యం చేసినట్లు జిల్లా అధికారులు గుర్తించి, విచారణ ప్రారంభించారు. ఒక నెలలోనే ఆస్పత్రిలో ఏడుగురు మరణించడం సంచలనంగా మారింది. ఎన్ జాన్ కెమ్ అనే వ్యక్తి క్రిస్టియన్ మిషనరీలో కార్డియాలజిస్ట్‌గా చలామణీ అవుతున్నారు. తాను ఫేమస్ బ్రిటన్ వైద్యుడిగా నటించాడు. దర్యాప్తులో అతడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్‌గా తేలింది. ఈ ఘటనపై న్యాయవాది, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు దీపక్ తివారీ మాట్లాడుతూ.. అధికారిక మరణాలు 07, అయితే, అసలు సంఖ్య దీని కన్నా ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. దీనిపై జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
పెద్దమ్మతల్లి గెలిపించమ్మా.. పూజలు చేసిన SRH ప్లేయర్లు
సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ టీమ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ దుమ్ములేపింది. భారీ స్కోర్ చేసి అందరినీ షాక్ కు గురి చేసింది. కానీ ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయి నిరాశ పరిచింది. ఈ క్రమంలోనే రేపు ఐదో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ప్లేయర్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఎస్ ఆర్ హెచ్ ప్లేయర్లు నితీశ్ రెడ్డి, అభిషేక్ శర్మ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ ఆలయానికి వచ్చారు. ఈ రోజు ఉదయమే వచ్చిన వీరిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. మ్యాచ్ లో గెలిపించాలని మొక్కుకున్నట్టు తెలుస్తోంది.