CM Revanth Reddy : క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయిచరణ్ (35) అక్యుర్డ్ మైలాయిడ్ లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) బారిన పడ్డారు. ఆయనకు భార్య లక్ష్మిప్రసన్న, కుమార్తెలు లక్ష్మి సుసజ్ఞ (6), స్మయ (2 నెలలు), తల్లిదండ్రులు రాము, సునీత ఉన్నారు. ఇంటికి ఆధారమైన సాయిచరణ్ క్యాన్సర్ బారినపడడంతో అతని చికిత్సకు కుటుంబ సభ్యులు…
CM Revanth Reddy : జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో మే 15వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతీ పుష్కరాలు విశేష ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ పుష్కర ఘాట్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కాళేశ్వర త్రివేణి సంగమంలో నిర్వహించబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుణ్యస్నానం ఆచరించేందుకు ఈ ప్రదేశాన్ని సందర్శించనున్నారు. ఆయన సందర్శనతో పుష్కరాల ఉత్సవం మరింత వైభవంగా సాగనుంది.…
Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 61.45 శాతం యాసంగి వడ్ల కొనుగోళ్లు పూర్తి అయినట్లు పేర్కొనింది. మే 12వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది అన్నారు.
Bhatti Vikramarka: భద్రాద్రి కొతగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో గల బయ్యారం టేకులపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు స్వయం ఉపాధితో ఎదగడానికి రాజీవ్ యువ వికాసం వరం లాంటిది అన్నారు.
కేటీఆర్ కు నాయకత్వం అప్పగిస్తే సహకరిస్తాను అని తేల్చి చెప్పారు. నేను క్రమ శిక్షణ గల పార్టీ కార్యకర్తను.. గత 25 ఏళ్లుగా పార్టీలో నిబద్ధతో పని చేస్తున్నాను.. నా లీడర్ కేసీఆర్.. ఆయన చెప్పినట్లు నడుచుకుంటానని హరీశ్ రావు తెలిపారు.
PCC Chief Mahesh Goud: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడంపై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆయన ఏ కులం అనేది క్లారిటీ ఇవ్వాలి? అని డిమాండ్ చేశారు. ముదిరాజా లేక రెడ్డి నా అనేది.. బీజేపీలో పదవులు రాలేదని మాపై అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు.
Eatala Rajendar: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు. హైడ్రాతో ముఖ్యమంత్రి దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 1965లో అల్వాల్ లో 50 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఓ కాలనీ ఉంది.. ఈ కాలనీకి ఇంటింటికీ నోటీసులు ఇవ్వడమే కాకుండా.. చివరికి గుడులకు కూడా నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.
భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్! బుల్లితెర యాంకర్ రష్మీ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు దాదాపు చాలా సినిమాలు చేసింది. కానీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘జబర్దస్త్’ కామెడీ షోతో మాత్రం ఫుల్‌గా పాపులర్ అయ్యింది రష్మి గౌతమ్. ఈ షో పేరునే ఇంటి పేరుగా మార్చుకుంది. దాదాపు పదేళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్‌గా చేస్తూనే ఉంది. అదే కమిట్మెంట్తో అలరిస్తూనే ఉంది. ఇదిలా…
Aadi Srinivas: ఈటెల రాజేందర్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈటెల మర్యాదస్తుడు అనుకున్నాం.. కానీ, ఆయనకు మతి తప్పిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలంటే మీ అధిష్టానాన్ని కాక పట్టుకో.. కానీ మా ముఖ్యమంత్రిని బూతులు తిడితే పదవి వస్తుందనుకోవడం నీ అవివేకానికి నిదర్శమని ఆయన అన్నారు. ఇంత కాలం రాజకీయాల్లో ఉండి చివరకు ఈ స్థితికి…