నేడు కొణిదెల గ్రామానికి పవన్ కళ్యాణ్.. సొంత నిధులతో..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామానికి వెళ్లనున్నారు. కొణిదెల గ్రామంలో పవన్ తన సొంత నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలతో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కొణిదెల గ్రామ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పవన్ ఇంటి పేరు ‘కొణిదెల’ అన్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో ‘కొణిదెల’ గ్రామం గురించి పార్టీ నేతలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పవన్ వెంటనే కొణిదెల గ్రామానికి వెళ్లి.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. గ్రామ పరిస్థితి గురించి ఎమ్మెల్యే జయసూర్య, గ్రామ సర్పంచ్ వివరించారు. కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు పవన్ హామీ ఇచ్చారు.
అంబర్‌పేటలో ‘లైవ్ న్యూడ్’ వీడియోల వ్యాపారం.. దంపతుల అరెస్ట్..!
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట ప్రాంతంలో దంపతులు కలిసి నిర్వహిస్తున్న లైవ్ న్యూడ్ వీడియో వ్యాపారం కలకలం రేపుతోంది. పక్కా ప్రణాళికతో నిర్వాహకుల్లా వ్యవహరిస్తూ, ఆన్ లైన్ లో తమ వీడియోలు అప్లోడ్ చేస్తూ.. డబ్బు తీసుకుని ప్రజలకు లింక్ పంపుతున్న ఈ వ్యవహారం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడితో బట్టబయలైంది. ఈ దంపతులు గత నాలుగు నెలలుగా “స్వీటీ తెలుగు కపుల్ 2027” అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్, ఇతర ఆన్లైన్ ప్లాట్ ఫారమ్ లలో తమ న్యూడ్ వీడియోలను ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి లైవ్ లింక్ చూడాలంటే రూ.2000 వసూలు చేస్తున్నారు. అలాగే రికాడ్ వీడియోల కోసం రూ.500 ఛార్జ్ చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా వీడియో షూట్ కోసం తమ నివాస భవనంపై ప్రత్యేకంగా కెమెరాలు, లైటింగ్, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలతో కూడిన సెటప్ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తెలిపింది. ఇక అధికారులు అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ దంపతుల ఇంటిపై దాడి చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి అని బిరుదు ఇస్తున్నాం..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. బోనాల పండుగను పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇప్పటివరకు 18 నెలల్లో రెండు లక్షల కోట్ల అప్పులు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. అయినా రాష్ట్రంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మొదలవ్వలేదు. కేసీఆర్ హయంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక అప్పులు తెస్తున్నామని సీఎం చెబుతుండడం అబద్ధం” అంటూ విమర్శించారు.
అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్ లో సూర్య.?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. భారీ నమ్మకాలు పెట్టుకున్న కంగువ బిగ్గెస్ట్ డిజాస్టర్ అవగా రెట్రో ప్లాప్ గా నిలిచింది. అయినా సరే వెనకడుగు వేయకుండా హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యం లో బ్యాక్ టు బ్యాక్ సినిమలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు సినిమాను ఫినిష్ చేసి, తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా మరొక యంగ్ దర్శకుడితో సినిమాకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఫేం అరుణ్ మాథేశ్వరన్ ఇటీవల సూర్యను కలిసి ఓ కథ చెప్పగా సూర్యకు బాగా నచ్చడంతో వెంటనే ఒకే చేసాడని సమాచారం. సూర్య కూడా అరుణ్ డైరెక్ట్ చేసే సినిమా సూపర్ హిట్ అయితే లోకేశ్ మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఈ విషయమైన రానున్న రోజుల్లో క్లారిటి వస్తుందేమో చూడాలి. అయితే మాథేశ్వరన్ ఇటివల కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వెలువడ్డాయి. లోకేష్ కూడా నిజమే అనే కన్ఫర్మ్ చేసాడు. కానీ ఇప్పుడు చూస్తే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. లోకేష్ కనకరాజ్ కోసం అనుకున్న కథను అరుణ్ మాథేశ్వరన్ ఇప్పుడు సూర్యకు చెప్పాడని చెన్నై సినీ వర్గాల టాక్. అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్ లో సూర్య చేయబోయే సినిమాను సన్ పిచర్స్ నిర్మించనుంది.
‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన!
చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి శంకుస్థాపన చేశారు. పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్‌ను చేపట్టారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్‌తో రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. సుమారు రూ.140 కోట్లతో మూడు కీలక అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శ్రీకారం చుట్టారు. రాజమండ్రి వద్ద గోదావరిపై 127 సంవత్సరాల పాత రైల్వే వంతెనను టూరిజం స్పాట్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాజమండ్రి నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు ప్రారంభించింది.
పిచ్చోడు.. భయంకరమైన వ్యక్తి.. భారత సంతతి మేయర్‌పై ట్రంప్ రుసరుసలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత దూషణల పర్వానికి దిగారు. భారత సంతతికి చెందిన న్యూయార్క్ మేయర్ అభ్యర్థి మమ్దానీపై పరుష పదజాలంతో విరుచుకు పడ్డారు. మమ్దానీ భయంకరమైన వ్యక్తి.. అతని గొంతు గరుకుగా ఉంటుంది.. అతడు అసలు తెలివైనవాడే కాదని మండిపడ్డారు. న్యూయార్క్ నగరంలో జరిగిన డెమోక్రటిక్ మేయర్ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వామపక్ష సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ గెలిచారు. ఈ విజయంపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. మమ్దానీ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి.. 100 శాతం కమ్యూనిస్ట్ పిచ్చివాడు అని అభివర్ణించారు. మరోవైపు, మమ్దానీకి న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో మద్దతు ఇచ్చారు. దీంతో అతడిపై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు.
డ్రగ్స్ రాష్ట్రాన్ని కబళించకుండా అందరం కృషి చేయాలి
తెలంగాణలో డ్రగ్స్ వ్యసనం రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో, నేషనల్ ఆంటీ డ్రగ్స్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అనే వ్యాధి యువతను భయంకరంగా పీడిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే వినిపించే సమస్య. ఇప్పుడు మాత్రం స్కూల్ల దాకా ప్రవేశించింది. చాక్లెట్లు, బిస్కెట్లు రూపంలో పిల్లలకు చేరుతోంది. ఇది అత్యంత భయంకరమైన పరిస్థితి,” అని సీతక్క అన్నారు. డ్రగ్స్‌ను వ్యాపారంగా మార్చిన కొంతమంది, లాభాల కోసం సమాజాన్ని మత్తులోకి లాగుతున్నారన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట.. రూ.180 కోట్లు మెడికల్ బిల్లులు విడుదల
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌గా ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ చేసింది. మొత్తంగా రూ.180.38 కోట్ల బిల్లులు విడుదల చేయడం ద్వారా దాదాపు 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల అమలు కొనసాగుతుండగానే, ఉద్యోగుల ఆరోగ్య ఖర్చులకు సంబంధించిన బిల్లులను ప్రాధాన్యతతో పరిష్కరించారు. 2023 మార్చి 4 నుండి 2025 జూన్ 20 వరకు పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులను సమగ్రంగా పరిశీలించి ఈ మొత్తాన్ని విడుదల చేశారు.
ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపై పవన్ కల్యాణ్ ఛలోక్తులు!
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛలోక్తులు విసిరారు. మనం తగ్గాలి కానీ.. బుచ్చయ్య చౌదరి తగ్గరు అని అన్నారు. తనకు ఇష్టమైన నాయకులలో ఒకరు బుచ్చయ్య చౌదరి అని పవన్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం పవన్ మాట్లాడుతూ.. బుచ్చయ్య చౌదరిని ప్రశంసించారు. రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని, అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘రాజమండ్రి అనగానే గుర్తుకు వచ్చేది గోదావరి తీరం. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇది. ఎందరో మహానుభావులు, కవులు, సాహితీ వేత్తలకు జన్మనిచ్చిన భూమి ఇది. ఎంతో కాలంగా ఉన్న కలను సాకారం చేసే దిశగా ముందుకెళ్లడం సంతోషం. అఖండ గోదావరి ప్రాజెక్టు కేంద్ర సహాకారం అందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపింది కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్. పోలవరం ప్రాజెక్టు పనులు పరుగెత్తాడానికి సహకారం అందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యటక కేంద్రాలకు పునరుజ్జీవం అందించాలని కోరుతున్నాం’ అని అన్నారు.
తేజేశ్వర్ హత్య కేసుపై గద్వాల ఎస్పీ క్లారిటీ.. సంచలన విషయాలు వెలుగులోకి
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన తేజేశ్వర్ హత్యకేసులో అసలు కథ బయటపడింది. ఈ కేసుపై గద్వాల జిల్లా ఎస్పీ ఒక ప్రెస్‌మీట్ నిర్వహించి నిందితుల కుట్రను బహిర్గతం చేశారు. తేజేశ్వర్ హత్య వెనుక ఉన్న ప్రేమ, ద్వేషం, కుట్రలను ఎస్పీ వివరించారు. బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితోనూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఐశ్వర్యను పెళ్లి చేసుకునేందుకు ఆమె కుటుంబం తేజేశ్వర్‌తో ఎంగేజ్‌మెంట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తేజేశ్వర్ అడ్డు తొలగించాలని తిరుమలరావు హత్య కుట్ర పన్నాడని ఎస్పీ తెలిపారు. తేజేశ్వర్‌ను తొలగిస్తే, ఐశ్వర్యతో సంబంధం కొనసాగించవచ్చని భావించిన తిరుమలరావు, సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించాడు. ఓసారి కాక చాలాసార్లు తేజేశ్వర్‌పై దాడికి ప్రయత్నించారు. చివరికి పొలం సర్వే చేయాల్సిన కారణంతో తేజేశ్వర్‌ను తీసుకెళ్లి, కారులోనే అతనిపై దాడి చేసి హత్య చేశారు. తేజేశ్వర్‌ను హత్య చేసిన అనంతరం తిరుమలరావు, ఐశ్వర్య లఢక్ లేదా అండమాన్‌కు వెళ్లి కొన్నిరోజులు ఎంజాయ్ చేయాలని పథకం వేసుకున్నారు. ఒకవేళ హత్య విఫలమైనా, ఈ ఆషాఢంలో లడక్‌కు వెళ్లాలనే ప్లాన్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.