డీజీపీకి బీజేపీ ఎమ్మేల్యే రాజా సింగ్ లేఖ రాశారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. బక్రీద్ 2025 సందర్భంగా పోలీసులు ఎన్ని ఆవులను రక్షించారు..? అని ప్రశ్నించారు. జంతువుల రవాణా, వధకు ఎన్ని పశువైద్య ధృవీకరణ పత్రాలు జారీ చేశారు? రాష్ట్రవ్యాప్తంగా అక్రమ గోవధను ఆపడానికి ఎలాంటి దీర్ఘకాలిక చర్యలు అమలు చేయబడుతున్నాయి? అని అడిగారు.
READ MORE: Vijay Antony : బిచ్చగాడు-3 వచ్చేది అప్పుడే.. విజయ్ ఆంటోనీ క్లారిటీ..
“పెద్ద ఎత్తున అక్రమ గోవధ అనేది శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదు. ఇది మన సమాజం యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక నిర్మాణంపై ప్రత్యక్ష దాడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో గోవులను రక్షించడానికి , గో రక్ష కమిటీలను స్థాపించడానికి తన నిబద్ధతను వ్యక్తం చేశారు. ఈ దార్శనికతను గౌరవించాలని, సంవత్సరంలో 365 రోజులు గో సంరక్షణ చట్టాలను అమలు చేయడానికి చురుకైన చర్యలు తీసుకోవాలని నేను మీ శాఖను కోరుతున్నాను.” అని డీజీపీకి రాసిన లేఖలో ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తావించారు.
READ MORE: Vijay Antony : బిచ్చగాడు-3 వచ్చేది అప్పుడే.. విజయ్ ఆంటోనీ క్లారిటీ..
వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలిచే గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఇటీవల ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కొత్త గోశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వేల సంఖ్యలో ఆవులు, దూడలు, ఎద్దులను కబేళాల్లో అక్రమంగా చంపుతున్నారని ఆరోపించిన రాజాసింగ్.. దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.