వానాకాలం పంటకు రైతులు సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమచేస్తోంది. రైతులకు డబ్బులు అందడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ రేపు రైతు భరోసా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ రైతు భరోసా సంబరాలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినందుకు సంబరాలు చేయాలా?.. రూ. 15 వేలు ఇస్తానని…
నేడు విశాఖలో యోగాంధ్ర వేడుకలు. RK బీచ్‌లో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్న మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, ప్రముఖులు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న యోగాంధ్ర వేడుకలు. నేడు ప్రపంచ యోగా దినోత్సవం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యోగా డే వేడుకలు. నేడు తెలంగాణలో ఘనంగా యోగా డే వేడుకలు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో యోగా డే వేడుకలు. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రముఖులు. మహబూబ్ నగర్…
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో 24వ తేదీన ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల (పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ) కమిటీ సమావేశం కానుంది. అనంతరం పీసీసీ సలహా కమిటీ (పీసీసీ అడ్వజరీ కమిటీ పీఏసీ) సమావేశాలు జరగనున్నాయి.
బనకచర్ల ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో.. ఆంధ్రప్రదేశ్ తో అసలు సమస్య మొదలైందని సీఎం రేవంత్ అన్నారు. మొదట తెలంగాణకు రిపోర్ట్ ఇచ్చి ఉంటే గొడవ వచ్చేది కాదు అని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాల పరిష్కారం కోసం మేము సిద్ధంగా ఉన్నాం.. అనవసర రాద్ధాంతం చేయాలని ఆలోచన మాకు లేదన్నారు.
Srinivas Goud: రాష్ట్రంలో వర్షాలు పడుతుంటే రిజర్వాయర్లను నింపుకోవాలని ఎవరైనా చూస్తారు.. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ముఖ్యంగా కరువు పీడిత జిల్లాలైన మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో వచ్చిన వరదతో రిజర్వాయర్లు నింపే అనవాయతీ ఉండేది.
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా టూర్స్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుందనుకున్న నేతలకు... ఇప్పుడు కాలం కలిసి రావట్లేదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడేసుకుంటున్నారు హాస్తం పార్టీలోని కొందరు నేతలు.
భారత్ పర్యటనలో ఉన్న టోనీ బ్లెయిర్‌తో ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (జూన్ 19న) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైతులు, యువత, మహిళలు లాంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు టోనీ బ్లెయిర్‌కు సీఎం తెలియజేశారు.
Hyderabad Metro Phase II: ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశం అయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-II అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు
Rythu Bharosa: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మేరకు ఆర్థిక శాఖ ఏ రోజుకారోజు నిధులను విడుదల చేస్తుంది.
బనకచర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవపడ్డానా? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ వాళ్లతో పోరాటం ఎందుకు? కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి.. మిగిలిన నీటినే మేం వాడుకుంటాం అన్నారు.. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణతో పోరాటం చేయను అని స్పష్టం చేశారు.. బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు అవసరం లేదు.. ఎవరి నీరు వారిది.. అవసరమైతే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందాం.. సముద్రంలోకి పోయే నీటిని ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో వాడుకుందాం అన్నారు చంద్రబాబు..