సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. తల్లికి ఎయిడ్స్ ఉందని కొడుకు ప్రచారం!
నేటి సమాజంలో రోజురోజుకూ దుర్మార్గాలు పెరిగిపోతున్నారు. ఆస్తి కోసం కొందరు దుర్మార్గులు ఎంతకైనా తెగిస్తున్నారు. నవమాసాలు మోసిన కన్న తల్లినే కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయితే తాజాగా మరో నీచమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి మొత్తం రాయించుకున్నాక.. కన్న తల్లికి ఎయిడ్స్ ఉందని కొడుకే పుకార్లు పుట్టించి ఇంట్లో నుంచి గెంటేశాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.
కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం కానున్న నిర్మాతలు..
టాలీవుడ్ లో గత 9 రోజులుగా షూటింగ్స్ కు బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిన్న, మిడ్ రేంజ్ నుండి భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో బిగ్ బడ్జెట్ సినిమాల నిర్మాతలకు భారీ నష్టాలు వస్తున్నాయి. ఎదో ఒకటి తేల్చాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ విషయమై కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం కాబోతున్నారు నిర్మాతలు. నిర్మాతల సమావేశం అనంతరం ఫెడరేషన్ సమావేశం కాబోతుంది.
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. అతి త్వరగా ఇళ్లకు చేరుకోండి!
అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో గత 5-6 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వానలతో దాదాపుగా అన్ని జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వరదలకు చెరువులు, జలాశయాలు నిండిపోయాయి. మరోవైపు రహదారులపై వరద చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రయాణికులు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు.
ఆశా వర్కర్లకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆశా వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజులు (6 నెలలు) పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు ప్రకటించింది. ఆశా వర్కర్ గా పనిచేయడానికి గరిష్ట వయసు 62 సంవత్సరాలుగా నిర్ణయించింది. సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనం 50% అంటే ₹5,000 చెల్లింపు చేపట్టనుంది. గరిష్టంగా మొత్తం1,50,000 వరకు చెల్లింపు చేపట్టనుంది. రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రత అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మీరు డాగ్ లవరా..? అయితే మీకు గుడ్‌న్యూస్..!
ఈ మధ్య కాలంలో కుక్కల దాడి ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చాలామంది చిన్నారులు కుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలలో ఆందోళన పెరిగింది. దీంతో వీధుల్లోని కుక్కలను తగ్గించాలన్న డిమాండ్లు కూడా బలపడుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వీధుల్లో కుక్కల సంఖ్యను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ వినూత్నమైన దత్తత డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.
“బీ ఏ హీరో, అడాప్ట్ డోంట్ షాప్” అనే నినాదంతో ఈ నెల 17న బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కులో ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ దత్తత డ్రైవ్ నిర్వహించబడనుంది. ఈ డ్రైవ్‌లో భాగంగా ఉన్న కుక్కపిల్లలకు ఇప్పటికే డివార్మింగ్, టీకాలు చేయబడ్డాయి. ఇవి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయని, స్నేహపూర్వక స్వభావం కలిగివుండటం విశేషం. ఈ కుక్కలను దత్తత తీసుకోవడానికి ఎలాంటి ఫీజులు ఉండవని, కావలసిన వారు ఉచితంగా దత్తత తీసుకోవచ్చని అధికారులు తెలియజేశారు.
రేపే అమరావతిలో బసవతారకం హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన.. పూర్తి వివరాలు ఇవే..
రేపు అమరావతిలో బసవతారకం హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టనున్నారు.. తుళ్లూరు – అనంతవరం గ్రామాల మధ్యలో బసవతారకం హాస్పిటల్ నిర్మాణానికి 21 ఎకరాల భూమిని సీఆర్‌డీఏ కేటాయించింది. రేపు ఉదయం 9:30 గంటలకు బాలకృష్ణ, కుటుంబ సభ్యులు శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి హాజరుకానున్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ నెల 13న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, ప్రముఖ సినిమా నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ గతంలో తెలిపారు.
బంగాళాఖాంతంలో అల్ప పీడనం.. మరో ఆరు రోజులు భారీ వర్షాలు..!
మధ్య బంగాళాఖాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. రేపటికి అల్ప పీడనంగా బలపడే అవకాశం ఉంది. ఆరు రోజులపాటు ఏపీకి విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉంది.. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. రేపు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.. ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లా రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల రిలేషన్.. అసలు విషయం చెప్పిన గువ్వల బాలరాజు
బీఆర్‌ఎస్ – కాంగ్రెస్ మధ్య ఉన్న రాజకీయ సంబంధాలపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గువ్వల బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ వ్యవహరించిన విధంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గొంతు నొక్కే విధానాన్ని అవలంబిస్తోందని ఆయన విమర్శించారు.
“కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కలసి నడుస్తున్నాయి. ‘నువ్వు కాకుంటే నేను, నేను కాకుంటే నువ్వు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి” అని బాలరాజు వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం చదవలేదని, దేశ ఖ్యాతిని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, ఆయన ఎప్పటికీ ప్రధాని కాలేరని అన్నారు. తెలంగాణ, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడుల్లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందో.. EVMలతోనా, బ్యాలెట్ పేపర్‌తోనా అనే ప్రశ్నలు లేవనెత్తారు.
“దొంగ ఓట్లు వేసిన వాళ్ళ పేర్లతో సహా”.. ఉప ఎన్నికలపై అంబటి సంచలన వ్యాఖ్యలు..
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఎప్పుడూ జరగనంత ఘోరంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 2017లో నంద్యాల కంటే దారుణంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేస్తున్నారని.. దొంగ ఓట్లు వేసిన వాళ్ళ పేర్లతో సహా మా నేతలు వివరాలు తెలిపారన్నారు.. పోలీస్ యంత్రాంగం వైసీపీ నేతలను బూతుల దగ్గరకు రాకుండా అడ్డుకున్నారు.. మా పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఇష్టానుసారం తిప్పారని మండిపడ్డారు.. ఇవాళ ఖాకీ దుస్తులు వేసుకున్న సంగతి మర్చిపోయి టీడీపీ ఏజెంట్ లా ఎన్నిక జరిపే కార్యక్రమం డీఐజీ కోయా ప్రవీణ్ చేపట్టారని ఆరోపించారు. ఇంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా..? అని ప్రశ్నించారు.