నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు జారీ..
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మూడు రకాల ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లు జారీ చేసింది. దేవాదాయ శాఖలో ఈఓ, వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ అధికారి, భూగర్భజలాల శాఖలో జియో ఫిజిక్స్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. వ్యవసాయ అధికారులు 10 పోస్టులకు ఆగష్టు 19 నుంచి సెప్టెంబరు 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఎండోమెంట్ ఈఓలు 7 పోస్టులకు ఆగష్టు 13 నుంచీ సెప్టెంబరు 2 వరకు ఆన్ లైన్ దరఖాస్తులకు అవకాశం ఉంది. జియో ఫిజిక్స్ టెక్నికల్ అసిస్టెంట్‌ల 4 పోస్టులకు ఆగష్టు 13 నుంచి సెప్టెంబరు 2 వరకు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
మా కార్యాలయానికే వచ్చి ‘కాల్చిపారేస్తా’ అంటారా..? డీఎస్పీ వ్యాఖ్యలపై అంబటి ఫైర్..!
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీ ఎన్నికలు ముగిశాయి. క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇచ్చారు. భారీ భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లు కడపకు తరలించనున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాదన నేపథ్యంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల వైసీపీ కార్యాలయానికి వచ్చారు. అవినాష్ ను వైసీపీ కార్యాలయంలోనే పోలీసులు నిర్బంధించారు. ఆ నేపథ్యంలో ఓ డీఎస్పీ వైసీపీ కార్యకర్తలను “ఎక్కువ చేస్తే కాల్చిపారేస్తా.. నా కొడకా.. నువ్వు తాగి మాట్లాడుతుండొచ్చు.. కానీ యూనిఫాం ఉందిక్కడ.” అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మా కార్యాలయానికే వచ్చి పార్టీ కార్యకర్తలను ‘నా కొడకల్లారా…. కాల్చిపారేస్తాను’ అంటూ పులివెందుల్లో డీఎస్పీ హెచ్చరించారు. పోలీస్ ఉద్యోగం ఇచ్చింది ప్రజలను కాల్చిపారేయడానికేనా? అని ప్రశ్నించారు.
ప్రతి టౌన్‌లో ‘మహిళా మార్ట్’లు ఏర్పాటు కావాలి
ఖమ్మం జిల్లాలో మహిళల స్వయం ఉపాధికి దోహదం చేసే విధంగా ఏర్పాటు చేసిన ‘మహిళా మార్ట్’ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మార్ట్‌లో స్థానిక మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ లభించడంతో, వ్యాపారం చురుగ్గా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అవకాశాలు విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన ట్విట్టర్ (X) ఖాతా ద్వారా స్పందించారు. ప్రజా ప్రభుత్వ సంకల్పం… అధికారుల కార్యచరణ… ఆడబిడ్డల ఆచరణకు… ప్రతిరూపం ఖమ్మంలో…దిగ్విజయంగా నడుస్తోన్న… ఈ ‘మహిళామార్ట్’. ఇందులో భాగస్వాములైన…ప్రతి ఒక్కరికి నా అభినందనలు. రాష్ట్రంలో… ప్రతి టౌన్ లో ఇటువంటి ‘మహిళా మార్ట్’ లు ఏర్పాటు కావాలి ఆకాంక్షిస్తున్నా.’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
జూనియర్ ఫాన్స్, ఎటాక్.. వార్ 2 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయ్!
ఎట్టకేలకు మోస్ట్ అవైటెడ్ జూనియర్ ఎన్టీఆర్ “వార్ 2” సినిమా తెలుగు స్టేట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న “వార్ 2” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్టర్‌గా చేస్తున్న ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందింది. “వార్” సినిమాకి సీక్వల్‌గా ఈ సినిమాని సిద్ధం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు రెండు కాలర్లు ఎగరేసుకునేలా ఈ సినిమా ఉంటుందని చెప్పడంతో జూనియర్ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్ తాజాగా ఓపెన్ అయ్యాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన తెలుగు స్టేట్స్ హక్కులన్నింటినీ నాగవంశీ మంచి ఫ్యాన్సీ ధరకు దక్కించుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని భాషల్లోనూ నాగవంశీ రిలీజ్ చేయబోతున్నాడు.
తిరుమలకు వెళ్లే వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై అది లేకుంటే నో ఎంట్రీ..!
తిరుమలకు వెళ్లే వాహనదారులకు బిగ్ అలర్ట్ జారీ అయ్యింది. అన్ని రకాల వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి కొత్త నిబంధన అమలులోకి వస్తుంది. అలిపిరి వద్ద ప్రత్యేకంగా ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు ఏర్పాటు చేసింది. మరోవైపు.. ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పాస్‌ను అధికారికంగా విడుదల చేయనుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రత్యేకంగా వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం రూపొందించారు. అర్హత కలిగిన వినియోగదారులు ఒకేసారి రూ.3 వేల రుసుము చెల్లించి 200 టోల్-ఫ్రీ ట్రిప్పులు లేదా ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏడాది లోపలే 200 ట్రిప్పులు పూర్తయితే అంతటితో పాస్ చెల్లుబాటు ముగుస్తుంది. పాస్ పరిమితి అయిపోయిన తర్వాత FASTag ఎప్పటిలాగే సాధారణ పే ఫర్ యూజ్ సిస్టమ్‌కు తిరిగి వస్తుంది.
సెల్పీ కోసం ఆరాటం.. అభిమానిని తోసేసిన జయా బచ్చన్..
సమాజ్‌వాది పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ట్రై చేసిన ఒక వ్యక్తిపై మండిపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని ఆగ్రహంతో పక్కకు తోసేసింది. అంతేకాదు ‘ఏం చేస్తున్నావు ..ఏంటిది ?’ అని అతడిపై మండిపడింది. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. చిన్న విషయాలకే సహనం కోల్పోతున్న జయా బచ్చన్ ప్రవర్తనపై నెటిజన్‌లు ఫైర్ అవుతున్నారు. ఇంత యాటిట్యూడ్ పనికిరాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ వివరాలు వచ్చేశాయ్.. ఎంత శాతమంటే..?
వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ కొన్ని ఘర్షణలతో పోలింగ్ సాగింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. రెండు చోట్లా 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు టీడీపీ, వైసీపీ మధ్యే జరిగింది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి.. ఒంటిమిట్టలో ముద్దు కృష్ణారెడ్డి (టీడీపీ), ఇరగం రెడ్డి (వైసీపీ) తలపడ్డారు. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు.
భారత్పై అమెరికా సుంకాలు.. భారీగా తగ్గబోతున్న ఇళ్ల ధరలు
భారతదేశం ఎగుమతి చేసే వస్తువులపై అమెరికా విధించిన టారీఫ్స్ కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు, వాటి ఉద్యోగుల ఆదాయంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ.45 లక్షల ధర పలికేగృహాల విక్రయాలు దెబ్బతినే అవకాశం ఉందని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ వెల్లడించింది. ప్రధానంగా ఈ సంస్థల్లో పని చేసే ఎంప్లాయిస్ ఈ ఇళ్లను కొనుగోలు చేస్తారని తెలిపింది. యూఎస్ ఎగుమతుల్లో ఎంఎస్‌ఎంఈల వాటా భారీగా ఉంటుంది. అధిక సుంకాలతో వాటి ఉత్పత్తులు, ఇతర దేశాలతో పోటీపడే ఛాన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో చిన్న, మధ్య తరగతి కంపెనీల ఆర్డర్లు తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది ప్రధానంగా ఉద్యోగులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని అనరాక్ సంస్థ చెప్పుకొచ్చింది.
వచ్చే 72 గంటలు అలెర్ట్‌గా ఉండాలని ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల సూచన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేయాలని సీఎం ఆదేశించారు. “వచ్చే 72 గంటలు అలెర్ట్‌గా ఉండండి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్ తో కమ్యూనికేషన్ కొనసాగించండి” అని సూచించారు.
అకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున, అవసరమైన హెలికాప్టర్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచాలని, హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ఫిర్యాదు చేయడానికి టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.