విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడు, రేపు పాఠశాలలకు సెలవు
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వానలతో రాష్ట్రం తడిసి ముద్దైపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 72 గంటలు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వయంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యం లో నేడు, రేపు GHMC పరిధిలోని పాఠశాలలకు హాఫ్ డే ప్రకటించిది విద్యాశాఖ.
పులివెందులలోని రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్.. ఎన్నికల సంఘం ఆదేశం
వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేడు రిపోలింగ్ జరుగనుంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
నేడు పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్రలో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 40 -50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్, ఎండీ తెలిపారు.
ఘోరం.. వ్యాన్-కంటైనర్ ఢీ.. ఏడుగురు పిల్లలు సహా 11 మంది మృతి
రాజస్థాన్‌లోని దౌసాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలు సహా 11 మంది మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున భక్తులతో వెళ్తున్న పికప్ వ్యాన్ ఆగి ఉన్న ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులు ఖతుశ్యామ్జీ ఆలయాన్ని సందర్శించి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.
నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న మంచు లక్ష్మి
బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసు టాలీవుడ్‌లో పెద్ద సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు వేగం పెంచింది. గత కొద్ది వారాలుగా ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల పై విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నటుడు విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, రానా దగ్గుబాటి వంటి స్టార్‌లు విచారణకు హాజరై తమ వివరణ ఇచ్చారు. వీరితో పాటు కొన్ని ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను కూడా ఈడీ ప్రశ్నించింది. ఈ కేసు మూలాలు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా అనధికారికంగా జరిగిన, భారీ స్థాయి డబ్బు లావాదేవీల్లో ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ యాప్ ద్వారా దేశం లోపల, బయటకు కోట్ల రూపాయలు మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా, డబ్బు పంపిణీ, చెల్లింపులు, ప్రమోషనల్ ఈవెంట్స్, బ్రాండ్ ఎంటర్స్‌మెంట్‌లలో భాగస్వామ్యంపై సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా..
కూలీకి అడ్వాన్స్ బుకింగ్స్ క్రేజ్ కు ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సింది రజినీకి కాదు
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్, టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతున్న చిత్రం కూలీ. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇప్పడు ఎక్కడ చుసిన కూలీ పవర్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోను మాస్ పవర్ చూపిస్తోంది. కూలీ అడ్వాన్సు బుకింగ్స్ అటు ఇటుగా రూ. 80 కోట్లు ఉన్నాయి. అయితే ఇంత భారీ వసూళ్లు రాబట్టడానికి సూపర్ స్టార్ రజినీ పవర్ అని కొందరు అంటే లేదు లేదు లోకేష్ కనకరాజ్ కారణమని మరొకొందరు వాదిస్తున్నారు. కానీ వాస్తవంగా చూసుకుంటే ఇంతటి భారీ బుకింగ్స్ కు రజనీ ఫ్యాక్టర్ కారణం కానే కాదు. ఒకసారి రజిని గత చిత్రాలైన లాల్ సలామ్, వెట్టయాన్ వసూళ్లు గమనిస్తే క్లారిటీగా అర్ధం అవుతుంది. ఆ రెండు సినిమాలు మినిమం ఓపెనింగ్ రాబట్టడానికి ముక్కి మూలిగాయి. ఇటు లోకేష్ కనకరాజ్ గత చిత్రాలు లియో, విక్రమ్ అడ్వాన్స్ బుకింగ్స్ నుండి ఫైనల్ రన్ వరకు అదరగోట్టాయి. డైరెక్టర్ లోకేష్ ఇప్పుడు తమిళనాట సెన్సేషన్. మనోడు డైరెక్షన్ అంటే చాలు హీరోతో సంబంధం లేకుండా క్రేజ్ పెరుగుతుంది. ఇప్పుడు కూలీ విషయంలోను ఇదే జరుగుతోంది. లోకేశ్ కనకరాజ్ క్రెడిబిలిటీకి రజినీ స్టార్ పవర్ యాడ్ అయింది అంతే. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఓవరాల్ గా కూలీ అడ్వాన్స్ బి బుకింగ్స్ అదరగొడుతుంది కానీ అందులో మెజారిటీ క్రెడిట్ లోకేష్ కనకరాజ్ కు దక్కుతుంది.
టారిఫ్ ఉద్రిక్తతల వేళ అమెరికాకు మోడీ.. ఎప్పుడంటే..!
ప్రధాని మోడీ మరోసారి అమెరికా పర్యటనకు సిద్ధపడుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఫిబ్రవరిలో మోడీ వైట్‌హౌస్ సందర్శించారు. ట్రంప్‌తో మంచి సంబంధాలు కనిపించాయి. అయితే ఈ మధ్య సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో మోడీ అమెరికా పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలకు ప్రపంచ నాయకులంతా హాజరుకానున్నారు. న్యూయార్క్ వేదికగా జరిగే ఈ సమావేశానికి ప్రధాని మోడీ కూడా హాజరుకానున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సహా పలువురు నాయకులను మోడీ కలవనున్నారు. పర్యటనలో భాగంగా ట్రంప్‌తో కూడా మోడీ సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల వివాదం పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
టీమిండియా మాజీ క్రికెటర్ కు ఈడీ షాక్.. నేడే విచారణ
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ (ఆగస్టు 13న) ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. అనధికారిక బెట్టింగ్ యాప్ 1xBetకి సంబంధించి కొంతమంది ద్వారా మద్దతు ఇచ్చినట్లు అనుమానాలు ఉన్నాయి.. వాటిపై స్పష్టత కోసమే విచారణ జరపాలని ఈడీ భావిస్తోంది. అయితే, దేశవ్యాప్తంగా అనధికారిక బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అనేక మంది వినియోగదారులను మోసం చేసి డబ్బును మనీ లాండరింగ్ చేస్తున్నట్లు ఈడీ ఇప్పటికే పలు కేసుల్లో విచారణ చేస్తుంది. ఇటీవల గూగుల్, మెటా సంస్థల ప్రతినిధులను కూడా సమన్లు జారీ చేసి, ప్రత్యామ్నాయ ద్వారా ఈ యాప్‌లు ఎలా ప్రచారం పొందుతున్నాయో వివరాలను తెలుసుకుంది. కాగా, 2025 మొదటి మూడు నెలల్లోనే 1.6 బిలియన్ సార్లు ఈ బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లను యూజర్లు సందర్శించారని అంచనా. భారతదేశంలో ఈ మార్కెట్ విలువ సుమారు 100 మిలియన్ డాలర్లుగా ఉందని సమాచారం.
ఏపీ సీఎం చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు
బాలయ్య, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు.. ఈ ముగ్గురిలో జూనియర్ ఎన్టీఆర్ ఎవరి గురించి అయినా ట్వీట్ చేసాడంటే అది అటు ఫ్యాన్స్ కు ఇటు టీడీపీ అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. బాబాయ్ – అబ్బాయ్ లను ఒకే వేదికపై చూడాలని నందమురి ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో సినిమా ఫంక్షన్స్ లో వీరుఇరువరు కలిసినపుడు అభిమానులు ఏంటో ఖుషి అయ్యారు. కానీ ఇప్పడు ఎవరికి వారే అనేలా ఉంటున్నారు. ఎవరి కారణాలు వారివి అది వారి వ్యక్తిగతం. బాబాయ్ బర్త్ డే నాడు అబ్బయ్ ట్వీట్ చేస్తే సోషల్ మీడియాలో సెన్సషన్ క్రియేట్ చేసింది.
రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నాం.. అవినాష్ రెడ్డి సంచలన కామెంట్స్
నిన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేడు రిపోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగిన తీరు రాష్ట్ర ప్రజలందరూ చూశారు.. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ స్లిప్ లు తీసుకుని వాళ్లే ఓట్లు వేశారు..