లిక్కర్ స్కాం కేసులో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్..!
లిక్కర్ స్కాం కేసులో సిట్ (SIT) రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన రెండో చార్జ్ షీట్ ను ఏసీబీ కోర్టులో వేసింది సిట్. ఇక ఈ చార్జ్ షీట్ లో సిట్ పేర్కొన్న కీలక అంశాల విషయానికి వస్తే.. ఈ లిక్కర్ స్కాం కేసులో మొత్తం ముగ్గురు నిందితుల పాత్రపై కీలక ఆధారాలను సిట్ పొందుపరిచింది. రిటైర్డ్ ఐఎఎస్ ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పాత్ర ఛార్జ్ షీట్ లో సిట్ వివరించింది. అలాగే లిక్కర్ పాలసీ మార్పు, సిండికేట్ సమావేశాలు, ముడుపుల వ్యవహారంలో వీరి ఆదేశాలు, అలాగే పాత్ర ఉందని నిర్దారణకు వచ్చింది. లిక్కర్ పాలసీ మార్పు, అమలు, కమీషన్లు, తదితర వ్యవహారాలను ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పరివేక్షించినట్టు గుర్తించారు అధికారులు. అలాగే లిక్కర్ ముడుపులు ఎలా సేకరించాలి, ఎక్కడ దాచాలి, బ్లాక్ ను వైట్ గా ఎలా మార్చాలి..? అనే అంశంలపై బాలాజీ గోవిందప్ప సూచనలు చేసినట్టు సిట్ గుర్తించింది.
30 ఏంటి 50% పెంచుతా..వేతన పెంపుపై నిర్మాత సంచలనం !
టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న సమ్మె పరిస్థితుల నేపథ్యంలో రైజింగ్ ప్రొడ్యూసర్స్ చిత్ర నిర్మాణంలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు ఎస్ కేఎన్, ధీరజ్, రాజేశ్ దండ, ప్రైమ్ షో చైతన్య, ఛాయ్ బిస్కెట్ శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, రాకేష్ వర్రె, తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – ఇండస్ట్రీలో 90 శాతం సినిమాలు చిన్న నిర్మాతలవే. మాకు పదవులు లేవు, మాట్లాడేందుకు పెదవులు తప్ప. ఇది గ్రూపిజం కోసం పెట్టిన ప్రెస్ మీట్ కాదు. చిన్న నిర్మాతలుగా మా బాధలు చెప్పుకునేందుకు పెట్టిన ప్రెస్ మీట్. గుడ్డు పెట్టేవాడికే తెలుస్తుంది బాధ.
వ్యాపారానికి అడ్డొస్తున్నాడని అంతమొందించారు
హైదరాబాద్‌లోని హాఫీజ్పేట్‌లో వ్యాపార విభేదాలు రక్తపాతం సృష్టించాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో కట్టెల వ్యాపారి శ్రీనివాస్ (37) దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం, వనపర్తి జిల్లా జంగమయ్యపల్లికి చెందిన శ్రీనివాస్ గత ఐదు సంవత్సరాలుగా హాఫీజ్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలోని మంజీరా రోడ్డులో కర్రల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ వ్యాపారం బాగా వృద్ధి చెందడంతో, స్థానిక వ్యాపారస్తులు సోహెల్, అతని ముగ్గురు సహచరులు అసూయతో కక్ష పెంచుకున్నారు.
ఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులు పంచుతున్నారు!
వైస్సార్సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ నేడు విజయవాడలో పులివెందులలో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కైమా కైమా చేసేస్తున్నాడన్నారు. అలాగే దీన్ని ఏమైనా ఎన్నిక విధానం అంటారా చంద్రబాబు అంటూ.. అసలు ఏమైనా ఆలోచన ఉందా అంటూ రెచ్చిపోయారు. ఇంకా ఆ ప్రాంతంలో ఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులు పంచుతున్నారని ఆయన అన్నారు.
తెలుగు హీరోయిన్‌కి ప్రభుత్వ వాహనం.. అసలు నిజం ఇదే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనం నిధి అగర్వాల్ పర్యటనకు వినియోగించారంటూ మీడియాలో వస్తున్న కథనాలకు ఆమె తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక లేఖను ఆమె విడుదల చేశారు. తాను ఇటీవల భీమవరంలో ఒక స్టోర్ లాంచ్ ఈవెంట్‌కి వెళ్లానని, అక్కడ తన కారు గురించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆ ఈవెంట్‌కి హాజరైన సమయంలో అక్కడి లోకల్ ఆర్గనైజర్లే తనకు ట్రాన్స్‌పోర్టేషన్ కల్పించారని చెప్పుకొచ్చింది.
టెక్నాలజీ వినియోగంతో ప్రజల భద్రతపై దృష్టి.. అవేర్ 2.0 లాంచ్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోని ఆర్టీజిఎస్‌ను సందర్శించి ‘అవేర్ 2.0’ను ప్రారంభించారు. అవేర్ డాష్‌బోర్డ్ ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లలో నీటి లభ్యతను పరిశీలించారు. అలాగే రియల్ టైమ్ స్క్రీన్‌పై వాహనాల ట్రాఫిక్ రద్దీని పరిశీలించి, తక్షణ చర్యలకు సూచనలు ఇచ్చారు. అనంతరం సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో ఆర్టీజిఎస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, జీరో మలేరియా లక్ష్యంతో ముందుకు సాగాలని ఆదేశించారు. డ్రోన్ల సాయంతో హాట్ స్పాట్‌లను గుర్తించి, వెంటనే కంటామినేషన్ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణతో రౌడీ షీటర్లలో భయాందోళన కలిగించాలని ఆయన సూచించారు. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి అసాంఘిక కార్యకలాపాలను అణచివేయాలని ఆయన స్పష్టం చేశారు.
బాబాయ్‌ను చంపిన వారికి ఓటు వేయాలా..?
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత పులివెందుల, ఒంటిమిట్ట జెడ్‌పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బాబాయ్‌ను చంపిన వారికి ఓటు వేయాలా? తల్లికి, చెల్లికి ఆస్తి పంచకుండా కోర్టుకు వెళ్లిన వ్యక్తికి ఓటు వేయాలా? అంటూ ప్రశ్నించారు. అలాగే మంత్రి అనిత మాట్లాడుతూ.. పులివెందులలో ఎన్నికలు ఎప్పుడూ భయపెట్టి, ఏకపక్షంగా జరిపే చరిత్ర ఉందని ఆమె పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌ల మార్పు నిర్ణయం ఎన్నికల కమిషన్‌దే తప్ప ముఖ్యమంత్రిది కాదని, అన్ని పార్టీలూ ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. నామినేషన్ చింపేసే రాజకీయాలు గతంలో చాలాసార్లు చూశామని, ఇప్పుడు జగన్ చేస్తున్న విమర్శలు కేవలం మాపై నిందలు మోపడానికి మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు.
పదవ తరగతి పరీక్షల్లో పాత మార్కుల విధానమే కొనసాగింపు
తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యాసంవత్సరం నుండి ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షల్లో ఇప్పటివరకు అమలులో ఉన్న 80% బాహ్య మూల్యాంకనం (External Assessment), 20% అంతర్గత మూల్యాంకనం (Internal Assessment) పద్ధతిని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం నుంచి ఆగస్టు 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, గతంలో జారీ చేసిన కొన్ని ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసి, పాత విధానాన్నే కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్, వరంగల్ ఆర్డీజేలు, రాష్ట్రంలోని అన్ని డిఇఓలు ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులకు డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ ఆమోదం తెలిపి, సంబంధిత శాఖాధికారులకు పంపించారు.
దేశ స్థాయిలో తెలంగాణ గౌరవం నిలబెట్టాలి
తెలంగాణ గౌరవాన్ని దేశ స్థాయిలో నిలబెట్టేందుకు యువత కృషి చేయాలని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్రానికి బలమైన మానవ వనరులు (Human Resource) అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సివిల్స్ – 2025 మెయిన్స్ కు ఎంపికైన 178 మంది అభ్యర్థులకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సివిల్స్ – 2024 విజేతలకు సన్మాన కార్యక్రమం కూడా జరిగింది.