BMS Auto Union: ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీస్ వల్ల ఆటో డ్రైవరలకు తీవ్ర నష్టం జరుగుతుందని బీఎంఎస్ ఆటో యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 70 శాతం మహిళలు ఆటోల్లో ప్రయాణిస్తారని అన్నారు.
వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్ట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నియంతృత్వ ధోరణితో పాలన కొనసాగింది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమ లక్ష్యాలని నీరు కార్చారు.. కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారు.
సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామని తెలిపారు. ప్రజాభవన్ లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటాను.. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోం.. శాసన సభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Bhatti Vikramarka: సచివాలయంలో ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన కొద్దిసేపటికే భట్టి మూడు శాఖలకు సంబంధించిన నిధులు మంజూరు చేస్తు సంతకాలు చేశారు.
Palla Rajeshwar Reddy: కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుంది అని నేను అనలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుందని అనలేదని,
రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారానికై తగు మార్గ దర్శకాలను ప్రతిపాదించేందుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దామోదర రాజ నర్సింహా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, తదితర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు…
సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ధరణిపై నిర్వహించిన సమీక్ష కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ రూప కల్పన ఎవరికి ఇచ్చారు. టెండర్ పిలిచారా? ఏ ప్రాతిపదికన వెబ్సైట్ క్రియేట్ చేసేందుకు అవకాశం ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18లక్షల 46వేల 416 మందికి ఇంకా పాస్ బుక్స్ ఇవ్వలేదని పేర్కొన్నారు.
సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధరణిపై సమీక్ష ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహా పాల్గొన్నారు. సుమారు 2 గంటల పాటు ధరణిపై సమీక్షించారు. ఈ క్రమంలో.. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. రెవిన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే.. నెలకు ఒకసారి మండల కేంద్రంలో రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని చర్చించినట్లు సమాచారం. కాగా.. ఎన్నికల్లో…
రాచకొండ పోలీసు కమిషనర్ గా జి. సుధీర్ బాబును ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. సీపీడీఎస్ చౌహన్ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. ప్రస్తుతం సుధీర్ బాబు.. హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో బాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. మూడు కమిషనరేట్స్ కో ఆర్డినేషన్ తో కలిసి పనిచేస్తాం.. ప్రజలకు ఎల్లవేళలా…