CM Revanth Reddy: నేటితో కాంగ్రెస్ పాలనకు నెల రోజులు.. స్పెషల్ ట్వీట్ చేసిన సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నెలరోజులు పూర్తి చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో డిసెంబర్ 7న రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పాలన నేటితో ఒక నెల పూర్తయింది. ఈ నేపథ్యంలో రేవంత్ తన నెలరోజుల పాలనను గుర్తు చేస్తూ ప్రత్యేక ట్వీట్ చేశారు. ఈ 30 రోజుల పాలన తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని కాంగ్రెస్ నేటితో నెల రోజు పాలపై సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు.
Read also: Komuravelli Mallanna: వైభవంగా మల్లన్న కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. పేదల గొంతుక వింటూ… యువత భవితకు దారులు వేస్తూ… మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ… రైతుకు భరోసా ఇస్తూ… సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందని తెలిపారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ… పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ… నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ… మత్తులేని ఛైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందన్నారు. రేవంత్ అన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా అని ట్విటర్ వేదికగా స్పందించారు.
Read also: Jabardasth Avinash: బిడ్డని కోల్పోయిన అవినాష్… తల్లి గర్భంలోనే మరణించిన శిశువు
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు గత నెల 3న వెలువడగా, కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. రెండుసార్లు అధికారాన్ని కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత తనదైన బ్రాండ్ పాలనతో ముందుకు సాగుతున్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో రెండింటిని అమలు చేశారన్నారు. ఇతర హామీల అమలు కోసం ప్రజాపరిపాలన పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అర్హులందరికీ త్వరలో అమలు చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది.
సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది.
పేదల గొంతుక… pic.twitter.com/gkzpRy1zGT
— Revanth Reddy (@revanth_anumula) January 7, 2024
TGO Mamatha Transfer: టీజీవో అధ్యక్షురాలు మమతపై బదిలీ వేటు..!
తాజావార్తలు
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!