Lok Sabha Election: తెలంగాణ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా రేవంత్ రెడ్డి.. భట్టి సహా 25 మంది సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది. మొత్తం 64 సీట్లతో తొలిసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతమవుతాయని భావిస్తున్నారు. ఫిబ్రవరి లేదా మార్చిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తన వ్యూహానికి పదును పెడుతోంది. కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతోంది. ఆ పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే పలుమార్లు సమావేశమై లోక్‌సభ ఎన్నికలపై కసరత్తు చేసింది. ఇటీవల ఏఐసీసీ లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రాల వారీగా ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు కమిటీలో చోటు కల్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేశారు. అందరూ కలిసికట్టుగా పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలు ముఖ్యమైన రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణలో 17 సీట్లు మాత్రమే ఉన్నాయని.. కనీసం 12 సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Read also: Drugs : విద్యార్థులకు డ్రగ్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్
Also Read
- BRS MLAs Arrested: తీవ్ర ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అరెస్ట్..
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
- Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
అందులో భాగంగానే సమర్ధుడైన రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక, ప్రస్తుత బలాబలాలు, సామాజిక సమీకరణలు తదితర వివరాలతో ఏఐసీసీకి నివేదిక ఇవ్వనున్నారు.. వారి నివేదిక ఆధారంగా అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేస్తుంది. అయితే కమిటీలోని పలువురు సభ్యులు లోక్‌సభ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. జానా రెడ్డి, బలరాం నాయక్, వంశీచందర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ వంటి నేతలు లోక్ సభ టిక్కెట్ రేసులో ఉండగా వారు కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు కమిటీ సభ్యులుగా.. చైర్మన్‌గా రేవంత్‌రెడ్డి, సభ్యులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, సీతక్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకులు జానా రెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీ, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజరుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, సంపత్‌కుమార్, రేణుకాచౌదరి, బలరాంనాయక్, మహేశ్వర్‌కుమార్ గౌడ్, పొదెం వీరయ్య, సునీతారావు, షబ్బీర్ అలీ, ప్రేంసాగర్‌రావుతో పాటు యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా అవకాశం కల్పించారు.
Praja Palana: 1.25 కోట్ల ప్రజా పాలన దరఖాస్తులు.. వాటి కోసమే ఎక్కువ అర్జీలు..!
తాజావార్తలు
-
YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
-
Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!