ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ నివాసంలో రెండో పంటకు సాగు నీటి విడుదలపై సమీక్ష చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే.. నాగార్జున సాగర్ నుండి సాగునీరు విడుదల చేయలేమని సాగర్ సీఈ(CE) తెలిపారు. తాగు నీటి కోసమే నీటి విడుదల అని అధికారులు ప్రకటన చేశారు. ఈ క్రమంలో.. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు, సాగుకు నీటి విడుదల లభ్యత…
Uttam Kumar Reddy: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లీకేజీలు, పిల్లర్లు కూలిన ఘటనలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వంతో మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ముందుకు వచ్చారు.
Dsp Nalini: తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన మాజీ డీఎస్పీ నళిని ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చారు. ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. మండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. అసెంబ్లీ ముందు ఉన్న ముళ్ల కంచెలు తొలగించే విషయమై అన్ని పార్టీలతో సమావేశం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆ అంశాలు.. అసెంబ్లీ, మండలి వ్యవహారాలు చైర్మన్, స్పీకర్ పరిధిలో ఉంటాయి.. మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తానని రేవంత్…
శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం కోసం తమ ప్రయత్నం కొనసాగుతుందన్నారు. ప్రజల హక్కులను కాపాడడం కోసం పాలన కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతిసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.. మేము ప్రజాస్వామిక పాలన అందిస్తామని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా.. అందరికీ నిరసనలు తెలుపుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో శనివారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఎటాక్ చేశారు. నిజంగానే సిగ్గు పడుతున్నా.. పంట భీమా, రైతు భీమాకి తేడా లేకుండా మాట్లాడుతున్నాడు సీఎం అని ఎద్దేవా చేశారు. అందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. 2014 వరకు ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ. 39 కోట్లు.. 2014 తర్వాత ఆదాయం పెరిగిందని తెలిపారు. ఇసుక…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. ఈ క్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మాటలు కోటలు దాటుతున్నాయి.. ఇప్పుడే గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగితే మైక్ ఇవ్వలేదన్నారు. సీఎం స్లీపింగ్ రిమార్కు చేశారు.. సీఎం మాదిరిగా స్లీపింగ్ రిమార్కు చేయనన్నారు. ఇంకా రేవంత్ సీఎం అయినట్టు భావించడం లేదు.. ఇంకా పీసీసీ చీఫ్ అనుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు పంపొద్దు.. వాళ్లు అన్ని వినాలని స్పీకర్ కు తెలియజేశారు. ఎంత గొడవ చేసినా బయటకు పంపొద్దు అధ్యక్ష అంటూ స్పీకర్ కు చెప్పారు. గవర్నర్ స్పీచ్ వింటుంటే సిగ్గు అనిపించింది అని కేటీఆర్ అన్నారు.. ఔను నువ్వు సిగ్గు పడాలని ముఖ్యమంత్రి విమర్శించారు. సిగ్గు పడే విషయాలు అన్ని చెప్తానన్నారు రేవంత్ రెడ్డి.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమాల నుండి వచ్చిన పార్టీ అని చెప్పుకుంటారు.. ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు తొమ్మిదిన్నర ఏండ్లలో ప్రగతి భవన్ పిలిచారా అని ప్రశ్నించారు. వాళ్ళ త్యాగం గుర్తించారా అని అన్నారు. కేసీఆర్.. అమరుల కుటుంబంకి బుక్కెడు బువ్వ పెట్టారా అని సీఎం పేర్కొన్నారు. ఆయన కుటుంబంలో అందరికి మంత్రి పదవులు ఇచ్చారు.. పేగు బంధం ఉన్నవాళ్లకు పదవులు ఇచ్చారు.. కానీ ఆత్మహత్య చేసుకున్న…