CM Revanth Reddy: ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి సీఎం వెళ్లనున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ ఇవ్వనున్నారు.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. న్యూ ఢిల్లీలోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు చేరుకున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్తారు.. అయితే, నిన్న పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై నేడు హైకమాండ్ పెద్దలతో సీఎం చర్చించబోతున్నారు.
CM Revanth Reddy: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, రాష్ట్ర రాజకీయాలు వంటి ఇతరత్రా అంశాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం ఢిల్లీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి సాయంత్రానికే హైదరాబాద్ రానున్నారు. ఇక అధిష్టానంతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి…
నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకై ఔటర్ రింగ్ రోడ్కు బయట, రీజినల్ రింగ్ రోడ్కు లోపల 500 నుండి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుండి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పై సోమవారం డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని లేఖలో ప్రస్తావించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో తెలిపారు బండి సంజయ్. ఒక్కో బాధిత కుటుంబానికి ఇండ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలని వినతి అని పేర్కొన్నారు.
Revanth Reddy: రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ హైకమాండ్ అనుమతితోనే కీలక నిర్ణయాలను అమలు చేస్తున్నారు.
Gandhi Bhavan: కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం గాంధీభవన్లో సమావేశం కానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్ సీ మురళీధర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల…