Venkatesh: తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దగ్గుబాటి బ్రదర్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు .. శనివారం ఉదయం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకొని ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం తో దగ్గుబాటి బ్రదర్స్ కొద్దిసేపు ముచ్చటించారు.ఇక వెంకటేష్ సినిమాలు గురించి రేవంత్ రెడ్డి అడిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తరువాత సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఒక్కొక్కరిగా వెళ్లి.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిరంజీవి, నాగార్జున ఇప్పటికే సీఎం ను కలిసి వచ్చారు. కొద్దిగా లేట్ అయినా ఇప్పుడు వెంకటేష్ కూడా వెళ్లి కలవడం ఆనందంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
ఇక వెంకటేష్ సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్యనే సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేదనే చెప్పాలి. ఇక ఈ సినిమా కాకుండా ప్రస్తుతం వెంకటేష్ చేతిలో మరో రెండుసినిమాలు ఉన్నాయి. త్వరలోనే అవి సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. మరి ఈ సినిమాలతో వెంకీ మామ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.
The Daggubati brothers, Victory @VenkyMama and Producer @SBDaggubati met the Honourable CM of Telangana @revanth_anumula at his residence and extended their best wishes #VenkateshDaggubati #SureshBabu #RevanthReddy pic.twitter.com/Psw5ff6zYh
— Vamsi Kaka (@vamsikaka) January 27, 2024