వరుస దూకుళ్ళతో గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గేట్స్ ఓపెన్ అని చెప్పాక పరిస్థితులు ఎలా మారుతున్నాయి? రెడీ.. గెట్ ..సెట్.. అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు? మర్యాదపూర్వకంగా అంటూ గతంలోనే సీఎంని కలిసిన వారిని ఎలా చూడాలి? జంపింగ్ జపాంగ్లపై పార్టీ అధిష్టానం వ్యూహం ఎలా ఉండబోతోంది? తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడంతా జంపింగ్ జపాంగ్ల సీజన్ నడుస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు జంప్…
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ విమర్శలు గుప్పించారు. ఇవాళ కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడూ.. విర్రవీగే మాటలు రేవంత్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపించాలని కొప్పుల ఈశ్వర్ అన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఏదో తప్పు చేసినట్లుగా చెప్పడం మూర్ఖత్వమే అవుతుందని, విచారణల పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ఎగ్గొడుతున్నారని విమర్శించారు కొప్పుల…
తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ క్రమంలో.. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లను కలిశారు. కాగా.. కాంగ్రెస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు తాటికొండ రాజయ్య. కాగా.. తాటికొండ రాజయ్య ఈ మధ్యే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..
రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నిన్న రాహుల్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. అటు నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ, సీఈసీ మీటింగ్ లో పాల్గొననున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చెండాలమైన పనులు అనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. పార్టీలు మారితే రాళ్లతో కొట్టాలన్న రేవంత్.. ఇప్పుడు తన పార్టీలోనే జాయిన్ చేసుకుంటున్నాడని విమర్శించారు. గతంలో చట్టబద్దంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటి ఎదుట చావు డప్పు కొట్టిన రేవంత్.. ఇపుడు ఇలా చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ముంబాయి వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E5099) ఆలస్యం అయింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ముంబై వెళ్లాల్సిన విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. విమానంలోని ఇంజన్ లో ఓవర్ హీట్ సమస్య రావడంతో ఏసీ సమస్య మొదలై.. విమానం అలస్యం అయింది.
Revanth Reddy: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్ఎస్ మీద నాకు గౌరవం ఉందని అన్నారు.
MP K. Laxman: మన దేశం లో ముస్లిం లు ఎంతో స్వేచ్చగా ఉన్నారు.. కేవలం అఘ్వనిస్తాన్, పాకిస్థాన్ బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చిన ముస్లిం లకు మాత్రమే CAA అడ్డుకుంటుందని రాజ్యసభ సభ్యులు ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
Revanth Reddy:ఇన్నాళ్లు సీఎం గా చూశారూ.. ఇవాల్టి నుండి పీసీసీ చీఫ్ గా నేనేం చేస్తానో చుస్తారు అంటూ సవాల్ చేశారు. పీసీసీ చీఫ్ గా పని మొదలు పెట్టిన.. గంటలో మీకు సమాచారం వస్తుందని హెచ్చరించారు.