సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా సవాలు విసిరారు. కాంగ్రెస్ చేసిన స్కాంల లిస్ట్ పంపిస్తా.. అవినీతి జరిగిందా లేదా రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని దేశంలో ఏకైక ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు. సీఎంగా చేసినప్పుడు కూడా మోడీ పై అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ ఏమి చేయలేదని.. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా రేషన్ ఇచ్చింది మోడీ సర్కారని…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం టి-సేఫ్ (T-SAFE) యాప్ ను ప్రారంభించారు. మహిళల ప్రయాణ భద్రత కోసం ఈ యాప్ ను రూపొందించారు. T-SAFE ద్వారా మహిళల భద్రత కోసం ప్రయాణ పర్యవేక్షణ సేవలను పోలీసుశాఖ అందిస్తుంది. కాగా.. అన్ని రకాల మొబైల్ఫోన్లకు అనుకూలంగా ఉండేలా ఈ యాప్ ను తయారు చేశారు. సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
లోకసభ ఎన్నికలకు ఏఐసీసీ చీఫ్ దూరం?.. కారణం ఇదే..! కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కర్ణాటకలోని గుల్బార్గా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తారు.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో కూడా పేరు చేర్చినట్లు తెలిసింది. కానీ ఖర్గే తన అల్లుడు రాధాకృష్ణన్ దొద్దమణిని గుల్బార్గా నుంచి ఎన్నికల బరిలోకి దించాలని చూస్తున్నట్లు టాక్. అయితే, మల్లికార్జున్ ఖర్గే గుల్బార్గా నుంచి రెండు…
పెళ్లి ఊరేగింపుపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి! 11 మందికి గాయాలు మధ్యప్రదేశ్లోని రాయిసేన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి సుల్తాన్పూర్ ప్రాంతంలో పెళ్లి ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ ట్రక్కు అదుపు తప్పి.. జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 11 మందికి పైగా గాయపడగా.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి బృందం హోసంగాబాద్ నుంచి పిపరియా గ్రామానికి జాతీయ రహదారిపై…
నేడు 10 వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధాని మోడీ. విశాఖ- భువనేశ్వర్, విశాఖ- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభం. కొత్తవలస- కోరాపుట్ సెక్షన్లు, కోరాపుట్-రాయగడ లైన్లలో డబ్లింగ్ పనులు ప్రారంభం. విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్లో పూర్తైన భాగాలు ప్రారంభం. నేడు సీఎం జగన్ విజయవాడ పర్యటన. కనకదుర్గ వారధి దగ్గర ఇరిగేషన్ రిటైనింగ్ వాల్.. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రారంభోత్సవం. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు…
తెలంగాణ కేబినెట్ మంగళవారం (మార్చి 11) సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. రేపటి క్యాబినెట్ లో పలు అంశాలపై చర్చించనున్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, 2500 రూపాయల ఆర్థిక సహాయం పై ప్రకటన.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. కొత్త రేషన్ కార్డుల జారీకి అనుమతి.. 2008 డీఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు.. 11 కొత్త బీసీ కార్పోరేషన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం పై చర్చించనున్నారు.
నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని, పెద్ద ఎత్తున పేదలకు జకాత్, ఫిత్రా పేరుతో దానధర్మాలు చేస్తారని గుర్తు చేశారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాస వేడుకలను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ బుటకపు వాగ్దానాలు చేసి తెలంగాణా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం చేసి కేసీఆర్ ను బొంద తీసి పెట్టారని విమర్శించారు.…
భద్రాద్రి రామయ్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రుల బృందం దర్శించుకుంది. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి తోపాటు మంత్రులకు పూర్ణకుంభంతో ఎండోమెంట్ కమిషనర్,ఈవో , అర్చకులు,వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో మూలమరుల వద్ద ముఖ్యమంత్రి , క్యాబినెట్ మంత్రుల బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి, మంత్రుల బృందానికి స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామివారి జ్ఞాపికతో పాటు వేదాశీర్వచనం అందించారు వేద పండితులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి,మంత్రులు కోమటిరెడ్డి,…