Komatireddy Rajgopal Reddy : భువనగిరిలో బీఆర్‌ఎస్ లేదు.. బీజేపీతోనే మాకు పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భువనగిరి పార్లమెంట్ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రంజాన్ తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. భువనగిరిలో బీఆర్‌ఎస్ లేదు. బీజేపీతోనే మాకు పోటీ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ రానున్నట్లు, మిర్యాలగూడ, చౌటుప్పల్ లో సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్లకుండా పని చేస్తామని, సీఎం ఆదేశాల ప్రకారం పని చేసి పార్టీని గెలిపిస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రివ్యూ మీటింగ్‌లో నాకు ఇంఛార్జి భాద్యతలు పార్టీ అప్పగించిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అని చర్చించామని, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారన్నారు.
అంతేకాకుండా..’చామల కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ ప్రచారం ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేశాం. భువనగిరిలో బీ ఆర్ ఎస్ చాప్టర్ క్లోజ్ అయ్యింది. 24 గంటల కార్యకర్తలు పని చేయాలి. పోలింగ్ వరకు కార్యకర్తలు విరామం లేకుండా పని చేయాలి. ప్రతి నియోజక వర్గంలో ఈ నెల 18 వరకు ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తాం. మే మొదటి వారంలో చౌటుప్పల్,మిర్యాలగూడ బహిరంగ సభలకు ప్రియాంక గాంధీ హాజరవుతారు. ఈ నెల 21న భువనగిరి నామినేషన్ వేసే రోజు భారీ ర్యాలీ నిర్వహిస్తాం. చామలా కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి. పార్టీ ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీకి,రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కోమటి రెడ్డి బ్రదర్స్ నన్ను సొంత తమ్ముడిగా భావించి పని చేస్తున్నారు. నన్ను భువనగిరి ప్రజల కుటుంబ సభ్యుడిగా భావించి ఓటు వేయండి. భువనగిరి సమస్యల మీద పార్లమెంట్ లో గళం వినిపిస్తా..’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!