రేపు వరంగల్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 12.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వరంగల్ టెక్స్ట్ టైల్ పార్క్‌కు మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం చేరుకోనున్నారు.
రైతుల రుణమాఫీ కోసం నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని ఆయన స్పష్టం చేశారు. రూ.2 లక్షలు వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని.. రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పీవీ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
Teacher Transfers: ఈ నెల 8వ తేదీన ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం అయింది. పదవీ విరమణకి 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది.
Konda Surekha: రేపు వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండటంతో జిల్లా మంత్రి మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం టూర్ వేళ తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
CM Revanth: ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. నా పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది.. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేస్తా..
Kaushik Reddy: పార్టీ మారిన వాళ్ళకి సిగ్గు శరం లజ్జ లేదు అని హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయనివ్వటం లేదు అని విమర్శలు గుప్పించారు.
కొత్తగూడెం పర్యటనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొత్తగూడెం పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బయలుదేరారు. ఆయనతో పాటు.. మంత్రులు కోమటిరడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. నేడు కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉదయం 11-00గంటలకు రూ.4కోట్ల రూపాయల DMFT నిధులతో బైపాస్ రోడ్డు నుంచి జివి మాల్ వరకు చేపట్టనున్న డ్రైన్ నిర్మాణ పనులు శంకుస్థాపన…