ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన తొమ్మిది కోచ్ లు.. 70మందికి గాయాలు రష్యాలోని కోమిలో ప్యాసింజర్ రైలు తొమ్మిది కోచ్‌లు పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఇంకా ఎంతమంది మరణించారో తెలియడం లేదు. రైలు 511 ఆర్కిటిక్ సర్కిల్ మీదుగా ఈశాన్య కోమిలోని వోర్కుటా.. నల్ల సముద్రపు ఓడరేవు నోవోరోసిస్క్ మధ్య సుమారు 5,000 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న ఢిల్లీ వెళ్లారు. అప్పటి నుంచి ఆయన వివిధ కేంద్రమంత్రులతో సమావేశాలు అవుతూనే… అధినాయకత్వంతో కూడా చర్చలు జరుపుతున్నారు. మూడురోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై తొలిరెండు రోజులు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. మూడోరోజు బుధవారం పీసీసీ చీఫ్ నియామకం, రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై మంత్రులతో కలిసి కాంగ్రెస్ హైకమాండ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర కేబినెట్‌విస్తరణపై ఢిల్లీ వేదికగా కాంగ్రెస్…
బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం, శ్రీనివాస రెడ్డి, సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇద్దరి సభ్యతం రద్దు కావాల్సి ఉందన్నారు.
చైనా మరో ఘనత.. భూమి మీదకు జాబిల్లి ఆవలి వైపు నమూనాలు చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలి వైపు నమూనాలు సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకుని చాంగే-6 వ్యోమనౌక భూమిని చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతాల్లో ఇది సురక్షితంగా ల్యాండ్ అయింది. మే 3వ తేదీన చాంగే-6 నింగికెగిరి దాదాపు 53…
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపారు. నన్ను నమ్మి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించారు, కేబినెట్ ర్యాంక్ ఇచ్చారన్నారు. ఎన్నో పోరాటాలు చేసి, రాష్ట్రాన్ని సాధించుకున్నామని, విభజన చట్టంలో పెట్టిన అంశా పై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు జితేందర్ రెడ్డి. కృష్ణా నుంచి రావలసిన నీటి వాటా కూడా రాలేదని,…
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్ బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఢిల్లీలో ఉండగా , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. తన రాజకీయ ప్రత్యర్థి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్‌కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవాలన్న రేవంత్‌రెడ్డి నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన…