Ambati Rambabu: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. మొన్న హైదరాబాద్‌లో ఆంధ్ర, తెలంగాణ ఇద్దరు సీఎంలు కలిశారు.. సీఎంల మధ్య సమావేశంలో చాలా వాటికి చర్చలు లేవు.. ప్రధానంగా ఈ సమావేశం దేనికి అనేది కూడా వివరణ లేదు. కొన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుందని కొన్ని మీడియావాళ్లకి లీకులు ఇచ్చారు. ఇద్దరి సీఎంలు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారు అనుకున్నా లేదు.. మాట్లాడిన మంత్రుల మధ్య కూడా క్లారిటీ లేదు అని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగాక అనేక అంశాలు పెడింగ్ లో ఉన్నాయన్న ఆయన.. విభజన జరిగాక మొదటి సీఎంగా చంద్రబాబు పని చేసాడు. మొదటి సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఎందుకు ఉమ్మడి రాజధానిని వదిలేసి పారిపోయి వచ్చాడు. తప్పు చేసాడు కాబట్టి మెడ పట్టి చంద్రబాబు హైదరాబాద్ నుండి గెంటేశారు అంటూ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు గత పాలనలో అన్ని తాత్కాలిక భవనాలను ఎందుకు కట్టారు అని నిలదీశారు.
Read Also: MLC Kavitha: కవిత పిటిషన్ పై విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
రాష్టాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. 7 వేల కోట్లు విద్యుత్ బకాయిలు మనకి రావాల్సి ఉంది.. శ్రీశైలం, నాగార్జున సాగర్ మధ్య నీటి వాటాల మధ్య చర్చలు జరిగాయా..? దాని మీద మాట్లాడారా…? అని ప్రశ్నించారు అంబటి.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం చేతికి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ కి తీర మార్గం ఉంది దాని మీద వాటా కావాలని అడిగారు అని తెలుస్తుంది. టీటీడీలో తెలంగాణకి వాటా కావాలని అడిగినట్టు తెలుస్తుంది.. విలీన మండలాల్లను తెలంగాణలో కలపాలి అని డిమాండ్ చేస్తున్నారు.. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. కృష్ణ జల్లాలో వాటా తెలంగాణ ప్రభుత్వం అడిగిందా..? మీరు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రులు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు రెండు రాష్టాలు రెండు కళ్ళు అంటున్నారు.. అంటే వాళ్లు డిమాండ్ చేసినవి అన్ని నిజాలే అనుకోవాలి అని వ్యాఖ్యానించారు.
Read Also: Amazon Prime Day Sale 2024: ప్రైమ్ డే సేల్‌లో అమ్మకానికి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదే!
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కి సీఎం.. మీ రాజకీయలు వేరుగా చేసుకోండి అని సలహా ఇచ్చారు అంబటి రాంబాబు.. ఆంధ్రప్రదేశ్ హక్కులను చంద్రబాబు వదిలేస్తున్నారు అని ఆరోపించారు. పోలవరం విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛతీస్ ఘడ్ మధ్య బేదాభిప్రాయలు ఉన్నాయి.. పోలవరంని ద్రోహం చేసే పని చంద్రబాబు చేస్తున్నారు. చంద్రబాబు గ్లోబల్ ప్రచారం చేసి అబద్దాలను నిజంలా ప్రచారం చేస్తారు అని విమర్శించారు. అయితే, రివర్స్ టెండరింగ్, కాంట్రాక్టర్ మార్చడం వలన పోలవరంకి నష్టం జరగలేదన్న ఆయన.. మీరు డయాఫ్రామ్ వాల్ మిస్టేక్ గా కట్టడం వలన నష్టం జరిగింది.. పోలవరం మీద చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు.. దాని మీద వచ్చే డబ్బులు కావాలి అని ఫైర్ అయ్యారు. మోడీ గారే గతంలో పోలవారాన్ని ఏటీఎం లా చంద్రబాబు వాడుకున్నారని అన్నారు. రాష్ట్ర విభజన హామీలలో తెలంగాణ ప్రభుత్వం డిమాండ్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.. ఆంధ్రప్రదేశ్ కోసం పని చేయండి.. సీఎంగా చంద్రబాబు చేస్తున్న పని మంచిది కాదు.. చంద్రబాబు జగన్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు వ్యక్తిత్వ ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల్లో జగన్ కి ఆదరణ తగ్గలేదని చంద్రబాబు తెలుసు.. ప్రస్తుతం ఓడిపోయాము కాబట్టి సైలెంట్ గా ఉంటున్నాం అన్కనారు.
Read Also: Komatireddy: తెలంగాణా వచ్చినా నల్లగొండకు ప్రయోజనం లేదు..
ఇక, దేశంలోనే నెంబర్ 1రాజకీయ నాయకుడుగా చెప్పుకునే చంద్రబాబు హోదా ఎందుకు వదిలేసారు..? అని ప్రశ్నించారు అంబటి.. 2014 లో కేసుల కోసం ఆంధ్రప్రదేశ్ ని పణంగా చంద్రబాబు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ కి రెండు సార్లు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఇద్దరి సీఎంలు కలవడం తప్పు కాదు.. చర్చలను రహస్యంగా ఉంచడం తప్పన్న ఆయన.. పోలవరం వలన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ కి ఎలాంటి నష్టం లేదని కోర్టు కూడా అఫిడవిట్ ఇచ్చారన్నారు.. పోలవరం వలన భద్రాచలం మునుగుతుందని గతంలో తెలంగాణ ప్రభుత్వం అన్నది.. రాష్ట్ర విభజన అంశాలు పక్కన పెట్టి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. సాగర్ రైట్ కెనాల్ కి వాటర్ వదలాలి అంటే తెలంగాణ ప్రభుత్వం లాక్ తీయాలి. 2014 లో చంద్రబాబు పోలీస్ యాక్షన్ చేసారు ఓటుకి నోట్ కేసు బయటికి వస్తుందని వెనక్కి వచ్చారు. జగన్ ప్రభుత్వంలో సాగర్ దగ్గర సెంట్రల్ ఫోర్స్ వచ్చింది.. మా పాలనలో లాక్ సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు తీసి వాటర్ విడుదల చేసారని గుర్తుచేసుకున్నారు. ఇక, రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్టానికి సీఎంగా చేసారు.. ఆయన జయంతి ఎవరైనా చేసుకో వచ్చు. ఆయన మరణం తర్వాత రాజశేఖర్ రెడ్డి నుండి పుట్టిన పార్టీయే వైస్సార్సీపీ అన్నారు.. ఏదేమైనా.. ముంపు మండలాలను తెలంగాణకి ఇస్తే పోలవరం ముందుకు వెళ్లదని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.