MLC Challa Venkatamireddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. అలాగే, ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. దీంతో పార్టీని వీడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇక కాంగ్రెస్‌లో చేరికలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్సీ కారు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నారు.
Read also: Kalki 2898 AD Collections : కల్కి ఇప్పట్లో ఆగేలా లేడు…ఓవర్ సీస్ లో ఆపేవాడు రాడు..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్త బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతుంది. ఈ క్రమంలో కాసేపటి క్రితం ఎమ్మెల్సీ చల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీరు అందించే నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్సీ కోరినట్లు సమాచారం. చల్లా వెంకట్రామి రెడ్డి ఈరోజు లేదా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో టాక్. అయితే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో గులాబీ పార్టీ ఏమీ చేయలేని పరిస్థిల్లో ఉండిపోయింది.
Droupadi Murmu: పూరీ బీచ్లో వాకింగ్ చేసిన రాష్ట్రపతి ముర్ము.. కీలక సందేశం..!